Diabetes Control Tips: పది రోజుల్లో సబ్జా విత్తనాలతో డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు..!

How To Control Diabetes In 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే  డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అయితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2022, 04:35 PM IST
  • సబ్జా విత్తనాలను ఉదయం పూట..
  • ఖాళీ కడుపుతో తింటే
  • డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
 Diabetes Control Tips: పది రోజుల్లో సబ్జా విత్తనాలతో డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు..!

How To Control Diabetes In 10 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే  డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అయితే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డయాబెటిస్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా చిట్కాలు ఉన్నాయి కానీ ఇవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిపుణులు సూచించిన చిట్కాలను పాటించడం చాలా మంచిది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సబ్జా విత్తనాలు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా విత్తనాలలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల మూలకాలు ఉంటాయని వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల బాడీ దృఢంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సబ్జా విత్తనాలను ఎలా వినియోగించాలి:

మూడు నుంచి నాలుగు చెంచాల సబ్జా విత్తనాలను తీసుకుని నీటిలో 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టి.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నమిలి మింగాలని నిపుణులు తెలుపుతున్నారు.
ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం తగ్గిస్తుంది. అంతేకాకుండా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఔషధంగా పని చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా వీటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది:

బరువును నియంత్రిస్తుంది:

సబ్జా గింజల్లో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రించి.. బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీవక్రియను వేగవంతంగా చేస్తాయి.

పొట్ట సమస్యలకు చెక్‌ పెడుతుంది:

ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని వినియోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజల్లో మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసే గుణాలున్నాయి.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది:

 సబ్జా గింజలలో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకోవాలి.

Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైన కీర్తి.. వరుడు ఎవరో తెలుసా?

Read Also: Bimbisara: దుమ్మురేపిన బింబిసార.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువగా.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News