How To Reduce Blood Pressure: అరటి పండుతో అధిక రక్తపోటుకు కేవలం 10 రోజుల్లో శాశ్వంతంగా చెక్‌ పెట్టొచ్చు!

How To Reduce Blood Pressure With Bananas: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అల్పాహారంలో అరటి పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా నియంత్రిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 26, 2023, 10:12 AM IST
How To Reduce Blood Pressure: అరటి పండుతో అధిక రక్తపోటుకు కేవలం 10 రోజుల్లో శాశ్వంతంగా చెక్‌ పెట్టొచ్చు!

How To Reduce Blood Pressure With Bananas: ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.. లేకపోతే రక్తపోటు సమస్యలతో పాటు, గుండెపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ రక్తపోటు స్థాయి 120/80 mmHg కంటే ఎక్కువగా ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తక్కువ కొలెస్ట్రాల్ ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు  పీచు, పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి అరటిపండు ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

ఇవి అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:

అరటిలో ఫైబర్, విటమిన్లు సమృద్ధి ఉంటాయి:
అరటిపండులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటితో పాటు ఫైబర్, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయి. అరటిలో కరిగే ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి:
అరటిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి తీవ్ర వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

పొటాషియం పరిమాలు కూడా ఎక్కువే:
అరటిపండ్లలో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు అరటిని ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు సమస్యలు రాకుండా ఉంటాయి.  మీడియం సైజు అరటిపండులో 450 గ్రాముల పొటాషియం ఉంటుంది. ప్రతి రోజు వీటిని అల్పాహారంలో పిల్లలకు ఇవ్వడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. 

సోడియం పరిమాణాలు తక్కువ ఉంటాయి: 
అరటిపండ్లలో సోడియం పరిమాణం చాలా తక్కువగా లభిస్తాయి. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. 

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు అరటిపండ్లను ఎలా తినాలో తెలుసా?:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అల్పాహారంలో అరటి పండును తీసుకోవాల్సి ఉంటుంది.  వీటిని స్మూతీ లేదా మిల్క్‌షేక్‌ల్లా చేసుకుని తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News