/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Guava Leaves For Cough And Cold: మారుతున్న జీవన శైలి కారణంగా దగ్గు, జలుబు సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ దీని తీవ్రత మాత్రం తగ్గలేదు. దగ్గు కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఊపిరితిత్తులు పాడైపోవడం, చాతి నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి తేలికపాటి దగ్గరైనా దాని నుంచి ఉపశమనం పొందడం చాలా ముఖ్యం. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ఔషధాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల దాని నుంచి వచ్చే దుష్ప్రభావాలకు గురవుతున్నారు. అయితే ఇంటి చిట్కాల ద్వారా కూడా ఈ దగ్గు, జలుబులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

జామ ఆకులతో ఉపశమనం పొందవచ్చు:
అవును ఇది నిజం జామ ఆకులతో కూడా దగ్గు జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని టీ గా చేసుకొని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ సమస్యలన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

జామ ఆకుల టీ:
ఈ ఆకుల్లో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి సీజనల్ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఈ జామ టీని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఈ టీని ఎలా తయారు చేయాలి..?:
జామ టీని తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నీటిని తీసుకొని.. అందులో శుభ్రం చేసుకున్న జామ ఆకులను వేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత అందులో అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. చివరకు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకొని ఆ టీ కి తగినంత వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించి వడపోసి తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్ వ్యాధులు దరిదాపులకు కూడా రావు. జామ ఆకులను వివిధ రకాల ఆహారాల్లో కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Also Read: Dussehra 2022 Date: దసరా రోజూ చేయాల్సి కార్యక్రమాలు ఇవే.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Instant Relief From Cough And Cold: If You Drink Guava Leaves Tea Regularly Cough And Cold Problems Will Reduced In 2 Minutes
News Source: 
Home Title: 

Instant Relief From Cough And Cold: జామ ఆకులతో కూడా దగ్గు, జలుబుల నుంచి చిటికేలో ఉపశమనం లభిస్తుంది.. ఎలాగో తెలుసా..?

 Instant Relief From Cough And Cold: జామ ఆకులతో కూడా దగ్గు, జలుబుల నుంచి చిటికేలో ఉపశమనం లభిస్తుంది.. ఎలాగో తెలుసా..?
Caption: 
Source: ZEE TELUGU NEWS
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

జామ ఆకుల టీలను క్రమం తప్పకుండా తాగితే..

దగ్గు, జలుబులు సమస్యలు 2 నిమిషాల్లో తగ్గుతాయి.

ఇలా సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీలను తీసుకోండి.

Mobile Title: 
జామ ఆకులతో కూడా దగ్గు, జలుబుల నుంచి చిటికేలో ఉపశమనం లభిస్తుంది.. ఎలాగో తెలుసా..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, October 4, 2022 - 15:05
Request Count: 
65
Is Breaking News: 
No