Iron Deficiency: వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు కూడా రెట్టింపు అవుతాయి. చాలామంది వృద్ధుల్లో పోషకాల లోపం తరచుగా ఏర్పడుతూ ఉంటుంది. దీని కారణంగానే చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది వృద్ధుల్లో ఐరన్ లో పని సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా శరీరంలోని రక్త పరిమాణాల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు మళ్ళిన స్త్రీలలో రక్తంలోని హిమోగ్లోబిన్ పరిమాణాలు తగ్గుతాయి. దీని కారణంగా రక్తహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తి అవకాశాలున్నాయి. కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని.. లేకపోతే తల తిరగడం, శరీరంపై సమస్యలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి శరీరానికి తగిన పరిమాణంలో ఐరన్ తప్పనిసరి. అయితే చాలామంది స్త్రీలు ఐరన్ లోపం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వైద్యులు సూచించిన సప్లిమెంట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందడమే కాకుండా తగిన పరిమాణంలో ఐరన్ కూడా లభిస్తుంది.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
ఐరన్ లోపం సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో అలసంద పప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పులో అధిక పరిమాణంలో ఐరన్ తో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ పప్పును ప్రతి రోజు తినడం వల్ల ఐరన్ లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు తీసుకునే ఆహారాల్లో భాగంగా అలసంద పప్పుతో తయారుచేసిన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తహీనత సమస్యను తగ్గించడానికి నల్ల ఎండు ద్రాక్ష కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ఐరన్ లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook