Jackfruit For High Blood Pressure: జాక్‌ఫ్రూట్ అన్ని సీజన్స్‌లో కూడా లభిస్తుంది. ఇందులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండులో అధిక పరిమాణంలో ఫైబర్, రఫ్‌గేజ్ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పండును తీసుకుంటే అధిక రక్త పోటు సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ పండును వేసవి కాలంలో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జాక్‌ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
జాక్‌ఫ్రూట్‌లో కలిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది సులభంగా ఆకలిని నియంత్రించిన పొట్ట సమస్యలతో పాటు మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ జాక్‌ఫ్రూట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
2. డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది:
డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజూ జాక్‌ఫ్రూట్‌ను తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జాక్‌ఫ్రూట్ ఫ్రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి సులభంగా షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
3. హై బిపి ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది:
అధిక బిపి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా జాక్‌ఫ్రూట్ తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సులభంగా రక్త నాళాలను విస్తరించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తుంది.
4. అల్సర్‌ను తగ్గిస్తుంది:
జాక్‌ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అల్సర్స్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు నోటి అల్సర్‌లను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో pH ను సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook