Jaggery Tea Benefits: మనలో చాలామంది రోజులో టీ ని కనీసం మూడు నుంచి నాలుగు సార్లు అయినా సాగుతూ ఉంటారు. ఇక చలికాలంలో అయితే లెక్కలేనాన్ని సార్లు తాగుతారు. సాధారణంగా టీ తయారీలో చక్కెరను వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువ తీపి తో కూడిన టీలను ప్రతిరోజు తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని బెల్లంను వినియోగించి తయారుచేసిన టీని ప్రతిరోజు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ బెల్లం టీ ని శీతాకాలంలో ప్రతిరోజు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయట.
పాలలో బెల్లంని వెయ్యడం వల్ల విరిగిపోతాయని చాలామంది బెల్లాన్ని వినియోగించడం మానుకుంటారు. కానీ కొన్ని చిట్కాలను వినియోగిస్తే పాలలో బెల్లాన్ని కలిపిన విరగకుండా ఉంటాయి. అంతేకాకుండా బెల్లం టీ ని తయారు చేసుకునే క్రమంలో కూడా తప్పకుండా పలు చిట్కాలు పాటించాలి. ముందుగా బెల్లం టీని తయారు చేసుకోవడానికి డికాషన్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం టీ పౌడర్ తో తయారు చేసుకున్న డికాషన్ ని పాలలో మిక్స్ చేసి టీలా తయారు చేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
ముఖ్యంగా బెల్లంతో తయారు చేసుకున్న టీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ టీలో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడేందుకు కూడా సహాయపడతాయి. ప్రస్తుతం చాలామంది రోగ నిరోధక శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ బెల్లం టీ చక్కగా పనిచేస్తుంది.
అంతేకాకుండా బెల్లం టీని ప్రతిరోజు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ఉండే ఔషధ గుణాలు మైండ్‌ను రిఫ్రెష్ చేసేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా ఈ టీని తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు. దీంతోపాటు ఈ బెల్లం టీని తాగడం వల్ల ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి