Gobi Medicine: కరోనాకు విరుగుడు ఎప్పుడు వస్తుంది? చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు కరోనా ఉద్ధృతి లేకపోవచ్చు. కానీ అది ఇంకా పూర్తిగా వదిలి పెట్టి వెల్లలేదు. కరోనా జబ్బును తెచ్చిపెట్టే SARS-COV-2 మన వాతావరణంలో తిరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజలపై ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం పొంచే ఉంది.
అందుకే ప్రపంచం కొవిడ్‌ను అరికట్టే విరుగుడు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే అంశంపై జాన్స్ హాప్కిన్స్ చిల్డ్రన్స్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్రూసిఫెరస్ రకం మొక్కలైన క్యాబేజీ, బ్రకోలీ, గోబీ పువ్వు వంటి సల్ఫోరఫేన్ రసాయనం సమర్థంగా పనిచేసే అవకాశముండటమే దీనికి కారణం. ఇది కరోనాలో రకాలైన డెల్టా, ఒమిక్రాన్‌తో పాటు SARS-COV-2 రకాల వైరస్‌ల వృద్ధిని 50% వరకు తగ్గిస్తున్నట్టు ప్రయోగశాల పరీక్షలోని ఫలితాలను వెల్లడించింది. మానవుడు శరీరకంగా కానీ మానసికంగా ఉండాలంటే కేవలం వారు తీసుకునే ఆహారంపై ఆధార పడి ఉంటుందని మరో సారి అధ్యయనాలు తెలిపాయి.
సల్ఫోరఫేన్ రసాయనం సమర్థంగా ఉన్న క్యాబేజీ, బ్రకోలీ, గోబీ పువ్వు క్రూసిఫెరస్ రకం మొక్కలు జలుబును తెచ్చిపెట్టే ఇతరత్రా కరోనా వైరస్‌లనూ నిలువరిస్తున్నట్టు ఈ అధ్యయనాల్లో తేలింది. సల్ఫోరఫేన్ రసాయనాన్ని తక్కువ మోతాదులో రెమ్‌డెసివిర్ మందుతో కలిపి ఇస్తే మరింత సమర్థంగా పనిచేస్తున్నట్టూ బయటపడింది. సల్ఫోరఫేన్‌కు మరో ప్రత్యేకత ఉంది. క్యాన్సర్‌ను నివారించే గుణం సల్ఫోరఫేన్‌కు ఉన్నట్టు నిపుణులు తెలిపారు. అయితే కరోనా వైరస్‌లనూ మట్టుబెట్టే శక్తి ఉన్నట్టు తేలటం విశేషం.
Also Read: Petrol Diesel Price Hike: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook