Health Benifits of Broccoli: బ్రకోలీ.. తినడానికి రుచికరమైనదే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బ్రకోలీతో చాలా రకాల వంటలు చేస్తారు. ఇవాళ మనం బ్రకోలీ జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో బ్రకోలీ జ్యూస్ బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది. అంతేకాదు, శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో దోహదపడుతుంది.
బ్రకోలీలో ఉండే పోషకాలు :
బ్రకోలీలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా, ఫైబర్, విటమిన్-సి కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
బ్రకోలీ జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
బ్రకోలీ జ్యూస్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో దోహదపడుతుంది. సాధారణంగా మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఇందుకు బ్రకోలీ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
బీపీని నియంత్రణలో ఉంచుతుంది :
బ్రకోలీ జ్యూస్ బీపీని నియంత్రణలో ఉంచుతుంది. బీపీ నియంత్రణలో ఉండటం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తవు. కాబట్టి బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి బ్రకోలీ జ్యూస్ బెస్ట్ అని చెప్పొచ్చు.
బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది :
బ్రకోలీ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంలో దోహదపడుతాయి. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది దోహదపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌కు బ్రకోలీ మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.
ఎముకల బలానికి :
బ్రకోలీ జ్యూస్ ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. కాబట్టి బ్రకోలీ తీసుకుంటే అది ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. దీనిని స్వీకరించే ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!
Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook