Type 2 Diabetes vs Tea: టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో కొత్త విషయం వెలుగుచూసింది. తాజాగా జరిపిన పరిశోధనలో..టీ వర్సెస్ డయాబెటిస్ విషయంలో ఆశ్చర్యపోయే నిజాలు వెలువడ్డాయి.
టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికారకమనే చెబుతారు. కానీ తాజాగా జరిపిన పరిశోధనల్లో ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడయ్యాయి. టీ వర్సెస్ డయాబెటిస్‌పై చేసిన పరిశోధనలివి. టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో టీ అద్భుతంగా పనిచేస్తుందనేది ఆ పరిశోధనల సారాంశం. ఆశ్యర్యంగా ఉందా..నిజమే..
ఈ పరిశోధన లేదా అధ్యయనం 8 దేశాల్లో పది లక్షలమందిపై జరిగింది. ఇందులో రోజుకు 4 కప్పుల వరకూ టీ తాగేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు 17 శాతం తక్కువగా ఉంటుంది. ఈ విషయం వివిధ అధ్యయనాలు, విశ్లేషణ తరువాత వెల్లడైంది. సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 23 వరకూ జరగనున్న యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్‌లో ప్రస్తావించనున్నారు. ఈ భేటీ స్వీడన్‌లో జరగనుంది.
అధ్యయనంలో ఏం తేలింది
బ్లాక్ లేదా గ్రీన్ టీ అనేది టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో దోహదపడుతోందని అధ్యయనంలో తేలింది. చైనాలోని వుహాన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకుల ప్రకారం..రోజుకు 4 కప్పుల టీ తాగి..టైప్ 2 డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చు. టీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ పదార్ధాలుంటాయి. టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గించవచ్చని చెప్పడం ఇదే తొలిసారి.
టీ ప్రత్యేకత, టైప్ 2 డయాబెటిస్ ముప్పు మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని వెతికి తీశారు. ప్రతిరోజూ 1 కప్పు టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు 1 శాతం, 1-3 కప్పుల టీ తాగడం వల్ల 4 శాతం, 4 కప్పుల టీ తాగడం వల్ల 17 శాతం ముప్పు తగ్గించవచ్చని అధ్యయనం చెబుతోంది. టైప్ 2 డయాబెటిస్‌లో పదే పదే దాహం వేయడం, త్వరగా మూత్రం రావడం, ఆకలి పెరగడం, హఠాత్తుగా బరువు పెరగడం, అలసట వంటివి ప్రధాన లక్షణాలు.
Also read: Constipation: నిద్రించే ముందు ఇలా చేస్తే చాలు..మలబద్ధకం సమస్య మటుమాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook