Lemon Peel Uses: నిమ్మకాయ తొక్కతో బోలెడు లాభాలు, ఈ తొక్కలతో ఇలా చేయండి..

Lemon Peel Uses: నిమ్మకాయ రసమే కాకుండా తొక్కలు కూడా శరీరానికి ప్రభావవంతంగా సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు అన్ని సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2023, 06:25 PM IST
Lemon Peel Uses: నిమ్మకాయ తొక్కతో బోలెడు లాభాలు, ఈ తొక్కలతో ఇలా చేయండి..

 

Lemon Peel Uses: నిమ్మకాయ పుల్లని రుచిని కలిగి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి నిమ్మనీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు వాంతి సమస్యను నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఔషధంలా ఉపయోగపడుతుంది. 

ప్రస్తుతం చాలా మంది నిమ్మకాయ రసం తాగిన తర్వాత పై తొక్కలను పడేస్తూ ఉంటారు. అయితే వీటి వల్ల కూడా అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ తొక్కల్లో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా తొక్కలో విటమిన్లు, మినరల్స్  కూడా భారీ మొత్తంలో లభిస్తాయి. అంతేకాకుండా దీని వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మ తొక్కతో కలిగే లాభాలు:
లెమన్ టీ:

లెమన్ టీతో శరీరం ఫిట్‌గా, శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే రసాన్ని వినియోగించిన తక్కను మరిగించి తీసుకుంటే శరీరానిక బోలెడు లాభాలు కలుగుతాయి. 

నిమ్మ తొక్క పొడి:
నిమ్మ తొక్కలను ఎండలో బాగా ఆరబెట్టి.. తర్వాత గ్రైండ్ చేసి పొడిలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని వంటకాల్లో వినియోగించడం వల్ల ఆహారాలు రుచిగా తయారవుతాయి. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఆహారాలు రుచి కోసం:
నిమ్మతొక్కలను పొడిలా తయారు చేసి గ్రైడ్‌ చేసుకుని సలాడ్‌లు, పెరుగు, స్మూతీస్‌ల్లో వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయి. దీంతో పాటు ఆహారాలు రుచి కూడా రెట్టింపు అవుతుంది. 

వీటిని శుభ్రం చేయోచ్చు:
నిమ్మతొక్కలను గ్రైడ్‌ చేసి పాత్రలను శుభ్రం చేసేందుకు కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల గిన్నెలపై ఉన్న మురికి కూడా సులభంగా తొలగిపోతుంది. అంతేకాకుండా క్రిములు కూడా తొలగిపోతాయి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x