శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు తగ్గాలంటే..

ఈరోజుల్లో గుండె జబ్బు రావడానికి  ప్రధాన కారణం కొవ్వు.

Updated: Jul 3, 2018, 05:10 PM IST
శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు తగ్గాలంటే..

ఈరోజుల్లో గుండె జబ్బు రావడానికి  ప్రధాన కారణం కొవ్వు. చాలా మందికి శరీరంలో కొవ్వు పేరుకుపోతుండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు కొవ్వు కలిగిన పదార్థాలను తినకుండా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. కింద సూచించిన విధంగా పాటిస్తే, పొట్ట దగ్గర కొవ్వునే కాదు, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇంటిదగ్గరే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చని చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • ఆహారంలో ఎప్పుడూ ఒకే రకం నూనె వాడకుండా రెండు మూడు రకాల నూనెలను కలిపి వాడాలి. డాల్డా తగ్గించాలి.
  • కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.
  • రోజుకు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినాలి.
  • బయటి ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
  • కూరలను ఆవిరిమీద ఉన్నప్పుడే ఆరగించాలి. కూరలలో నూనెవాడకం తగ్గించాలి.
  • జీడిపప్పు, వేరుశెనగ వంటి పప్పు ధాన్యాలను, తృణధాన్యాలు  పరిమితంగా తినాలి.
  • పూరీల కన్నా పుల్కాలే ఆరోగ్యానికి మంచివి.
  • కొవ్వు తీసేసిన పాలు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగకుండా నియంత్రించవచ్చు.
  • అధిక బరువును తగ్గించుకునేందుకు వాము, పెసలు ఎంతగానో ఉపయోగపడుతుంది.