Low Sodium Diet: మనం ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలోని తగిన పరిమాణంలో సోడియం ఉండడం చాలా ముఖ్యం. శరీరంలో సోడియం పరిమాణాలు అధికంగా ఉన్న, తక్కువ మోతాదులో ఉన్న తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..ప్రతిరోజూ 5 గ్రాముల ఉప్పు తినడం ఆరోగ్యానికి సాధారణమని, దీని కంటే ఎక్కువగా తిన్న, తక్కువగా తీసుకున్న తీవ్ర వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
హైపోటెన్షన్:
శరీరంలో సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనినే వైద్యులు హైపోటెన్షన్ అని అంటారు. హైపోటెన్షన్‌తో బాధపడుతున్నప్పుడు మైకము, మూర్ఛ వంటి సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక హైపోటెన్షన్‌తో బాధపడేవారిలో సులభంగా ఇతర శరీర భాగాల నుంచి రక్తప్రవాహాన్ని కలిగిస్తుంది.
హైపోనట్రేమియా:
రక్తంలో సోడియం స్థాయి ప్రమాదకరంగా తగ్గిపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వికారం, తలనొప్పితో పాటు మూర్ఛ వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమందిలో హైపోనాట్రేమియా కారణంగా ప్రాణాలు కోల్పోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఎలక్ట్రోలైట్ సమతుల్యత:
శరీరంలోని సోడియం పరిమాణాలు తగ్గడం వల్ల ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా కండరాల తిమ్మిరి, బలహీనత, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల రావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వ్యాయామాలు తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
ఇన్సులిన్‌లో మార్పులు:
తక్కువ సోడియం కలిగిన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా రావచ్చు. కాబట్టి ఆహారాల్లో తప్పకుండా తగిన పరిమాణాల్లో ఉప్పను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కిడ్నీ సమస్యలు:
సోడియం తక్కువ పరిమాణంలో ఉండే ఆహారాలు తినడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు కూడా రావచ్చు.
కండరాలు, నరాల సమస్యలు:
సోడియం లోపం కారణంగా నరాల సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో కండరాల సంకోచాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా కండరాల బలహీనత, తిమ్మిర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి