Male Infertility: స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ మెరుగ్గా ఉండాలంటే.. జంక్ ఫుడ్స్ కు చెక్ పెట్టండి!

Married Men's Health Tips: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నాయి. దీంతో పెళ్లైన పురుషులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సంతానోత్పత్తికి చెడు ఆలవాట్లు కూడా ఒక కారణం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 12:10 PM IST
Male Infertility:  స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ మెరుగ్గా ఉండాలంటే.. జంక్ ఫుడ్స్ కు చెక్ పెట్టండి!

Junk Food For Male Fertility: పెళ్లయిన తర్వాత చాలా మంది మగవాళ్ళు (Married Men) తండ్రి అవ్వాలని, సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ స్పెర్మ్ కౌంట్ (Sperm Count) తక్కువగా ఉండటం వల్ల వారి సంతానోత్పత్తికి (Male Fertility) దూరమవుతారు. దీంతో వారి కలలు చెదిరిపోతాయి. అయితే కొన్నిసార్లు పురుషుల చెడు అలవాట్లు కూడా వారి ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇటీవల కాలంలో పురుషులలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత క్షీణించడం పెద్ద సమస్యగా మారింది. దీంతో వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

పరిశోధనలో ఏం తేలింది?
కొన్నేళ్ల క్రితం అమెరికాలోని ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌లో 99 మంది పురుషులపై జరిపిన పరిశోధనలో మార్కెట్‌లో జంక్ ఫుడ్స్ (Junk Food For Male Fertility) ఎక్కువగా తినేవారిలో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ ((Sperm quality) తగ్గుముఖం పడతాయని తేలింది. మరోవైపు, వారి శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు సరైన మొత్తంలో ఉన్న పురుషుల స్పెర్మ్ నాణ్యత మెరుగ్గా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా కూరగాయల నూనెలు మరియు చేపలలో కనిపిస్తాయి. 

స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక మిల్లీలీటర్ వీర్యంలో స్పెర్మ్ సంఖ్య 15 నుండి 39 మిలియన్లు ఉంటే, అది సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. పురుషుల వీర్యంలో 50 నుండి 150 మిలియన్ల స్పెర్మ్‌లు ఉన్నప్పుడు, అతను తండ్రి కావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ ఇది స్త్రీల అండాలపై కూడా ఆధారపడి ఉంటుంది. 

Also Read: Obesity Treatment: స్థూలకాయం ఎందుకొస్తుంది, ఎలా గుర్తించాలి, చికిత్స పద్ధతులేంటి

స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉండాలంటే..
1. అసురక్షిత సెక్స్ నుండి దూరంగా ఉండటం మంచిది. 
2. ఈరోజే సిగరెట్, ఆల్కహాల్ వ్యసనాన్ని మానేయండి. లేదంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. 
3. రెగ్యులర్ వర్కవుట్‌లు చేస్తూ ఉండండి. బొడ్డు దగ్గర కొవ్వు ఎక్కువగా పెరగనివ్వవద్దు.
4. పురుషులు సంతానోత్పత్తిని మెరుగుపరచాలనుకుంటే, ఖచ్చితంగా రోజులో కనీసం 7 నుండి 8 గంటల నిద్రను తీసుకోండి.
 5. చాలా బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించడం మానుకోండి, ఎందుకంటే ఇది ప్రైవేట్ పార్ట్‌లో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
6. వేడి నీటితో స్నానం చేయడం మానుకోండి, ఎందుకంటే ఇది స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.
7. మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోండి, ఆయిల్ ఫుడ్ నపుంసకత్వానికి కారణమవుతుంది. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News