Menopause Precautions: మెనోపాజ్ దాటాక హార్ట్ ఎటాక్ వ్యాధుల ముప్పు పెరుగుతుందా

Menopause Precautions: నెలసరి అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అంతర్భాగం వంటిది. టీనేజ్ వయసుకు ముందు ప్రారంభమై..ప్రౌఢ వయస్సు అంటే 45 ఏళ్లు వచ్చేవరకూ కొనసాగుతుంది. ఇక ఈ దశలో ప్రతి మహిళకు సర్వ సాధారణ మెనోపాజ్. అంటే నెలసరి నుంచి విముక్తి పొందడం. అయితే మెనోపాజ్ ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుందా...పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2024, 11:56 PM IST
Menopause Precautions: మెనోపాజ్ దాటాక హార్ట్ ఎటాక్ వ్యాధుల ముప్పు పెరుగుతుందా

Menopause Precautions: ముఖ్యంగా మెనోపాజ్ సంభవించి తరువాత మహిళల్లో గుండెపోటు ముప్పు ఎక్కువౌతుందనేది తాజా అధ్యయనాల్లో వెల్లడి కావడం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే ప్రతి మహిళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురౌతుంటాయి. నెలసరి కావచ్చు, మెనోపాజ్ కావచ్చు..ఈ రెండు దశల్లోనూ మహిళలో కీలకమైన మార్పులు స్పష్టంగా చూడవచ్చు.

ప్రతి మహిళకు జీవితంలో నెలసరి ఎంత ముఖ్యమో మెనోపాజ్ అంతే ముఖ్యం. ప్రతి మహిళ 45-55 ఏళ్ల వయస్సుకు చేరినప్పుడు మెనోపాజ్ సంభవిస్తుంటుంది. ఈ సందర్భంగా శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా అంటే ఎక్కువ కేసుల్లో 51 ఏళ్లు దాటాకే మెనోపాజ్ వస్తుంది. అయితే మెనోపాజ్ సందర్భంగా గుండె పోటు ముప్పు పెరుగుతుందనేది ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అందించిన వివరాల ప్రకారం మెనోపాజ్ మహిళల్లో గుండె పోటు ముప్పు పెరుగుతోంది. మెనోపాజ్ సమయంలో మహిళలకు సాధారణంగా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంటుంది. అంతేకాకుండా కడుపు భాగంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొవ్వు పేరుకుపోతుంది. మెనోపాజ్ సమయంలో కన్పించే హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమట్లు పట్టడం, అధిక రక్తపోటు వంటివి గుండె పోటు ముప్పును పెంచుతుంది.

ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల ఆ ప్రభావం కాస్తా గుండె ఆరోగ్యంపై పడుతుంది. అందుకే గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండె వ్యాధులు ఎక్కువగా కన్పిస్తాయి. మునుపటి కంటే ఎక్కువ కన్పిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గినప్పుుడు కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంటుంది. ఆర్టరీస్ లో ప్లగ్ పేరుకుంటుంది. దాంతో ఆర్టరీస్ సంకోచించి రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెనోపాజ్ సమయంలో కన్పించే డిప్రెషన్, మానసిక ఆందోళన కూడా గుండెపోటుకు సంబంధించిందేనని పరిశోధకులు అంటున్నారు. అందుకే మెనోపాజ్ వచ్చిన మహిళలు ఎప్పటికప్పుడు వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

మెనోపాజ్ మహిళల్లో గుండె వ్యాధులు తగ్గించేందుకు సూచనలు

ఎప్పటికప్పుుడు గుండె ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాకుండా ఫ్యాట్ లేని ఆహారమే డైట్‌లో ఉండేట్టు చూసుకోవడం చేయాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజులు కనీసం 45 నిమిషాలు నడవాలి. బరువు ఎక్కువైతే డైట్ పక్కాగా పాటించాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. మధుమేహం వ్యాధిగ్రస్థులైతే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. 

Also read: Male Menopause: పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుందా, ఎలాంటి లక్షణాలుంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News