Methi Leaves For Diabetes: చలికాలంలో ఆకుకూరలు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తాయి. చని కూరగాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో మెంతి ఆకుల కూర అధికంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ వాతావరణం లోనే మెంతి సాగును అతిగా చేస్తారు. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి విటమిన్లు ఫైబర్ మినరల్స్ లభిస్తాయి. దీంతో శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇందులో ఉండే గుణాలు మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్యానికి నువ్వు చెబుతున్నారు. మెంతి ఆకులతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మధుమేహంతో బాధపడుతున్నారా..?
మెంతి గింజలను చాలామంది రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు వినియోగిస్తారు. అయితే మెంతి గింజలకు బదులుగా మెంతి ఆకులను కూడా వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఉండే సీజన్లో మెంతి ఆకులు లభిస్తాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి దీంతో మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
గుండెకు ప్రయోజనకరం:
మెంతి ఆకుల్లో ఉండే పోషకాలు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తాయి ఆకుల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి కుంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా మెంతి కూరను తినాల్సి ఉంటుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది:
మెంతి ఆకుల్లో విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభించి ఎముకలు దృఢంగా మారతాయి. మెంతి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
శరీర బరువును తగ్గించుకునేందుకు సహాయపడతాయి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది శరీర బరువు పెరుగుతున్నారు. అయితే శరీర బరువు నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ మెంతికూరను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
Also Read : Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?
Also Read : Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook