Reduce Cholesterol In 25 Days with Moong Dal: శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం కారణంగా ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధిలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాల్లో పెసర పప్పును వినియోగించాల్సి ఉంటుంది.
పెసర పప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
రోజువారీ ఆహారంలో పప్పుల ప్రాముఖ్యత చాలా ఎక్కువని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గింస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా పెసర పప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
పెసర పప్పు ఎలా తినాలి..?
పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి క్రమం తప్పకుండా పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. పప్పు తొక్కతో పాటు నీళ్లలో నానబెట్టి శుభ్రం చేసి మరుసటి రోజు నేరుగా దోసలా వేసుకుని తినొచ్చు. కావాలంటే నానబెట్టిన మొత్తం పెసర పప్పులో ఉప్పు, ఉల్లిపాయలు వేసి టేస్టీగా వేయించుకుని తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
పెసర పప్పులో హైపోకొలెస్టెరోలేమియా తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనితో తయారు చేసిన ఆహారాలు పదార్థాలను ఆరోగ్య నిపుణులు తరచుగా తినమని సూచిస్తారు. ఈ పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రక్తపోటును నియంత్రణలో ఉంటుంది:
పెసర పప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడమేకాకుండా సిరలలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బీపీ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఆహార పదార్థాలను తినాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rahul Gandhi Eviction Notice: ఎవిక్షన్ నోటీసుపై స్పందించిన రాహుల్, ఆ జ్ఞాపకాలు పదిలం
Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook