కాళ్ల మజిల్స్‌లో నొప్పి ఇటీవలి కాలంలో తీవ్ర సమస్యగా మారుతోంది. ఈ నొప్పి ఉన్నప్పుుడు నరకప్రాయంగా ఉంటుంది. ఇంత తీవ్రమైన నొప్పిని సులభంగా తగ్గించే విధానముంది. ఆ వివరాలు మీ కోసం..
మజిల్ పెయిన్ సమస్య సర్వ సాధారణంగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. కాలి మజిల్స్‌లో తొడ నుంచి కిందివరకూ భరించలేని నొప్పి ఉంటుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది అల్లోపతి మందులు వినియోగిస్తుంటారు. మందులు వాడినంతసేపే నొప్పి తగ్గి..ఆ తరువాత పెరిగిపోతుంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ మందుల వాడకం తగ్గించాలి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు మజిల్ పెయిన్ ఎందుకొస్తుంది, ఎలా విముక్తి పొందవచ్చో తెలుసుకుందాం..
పోషక పదార్ధాల కొరత
సరైన భోజనం తినకపోతే..శరీరంలో పోషక పదార్ధాల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా మజిల్స్ పెయిన్ సమస్యగా మారుతుంది. నొప్పి ఎక్కువైనప్పుడు శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం తగిన మోతాదులో లేకపోయినా, లేదా తగినంత నీరు తాగకపోయినా ఈ సమస్య వెంటాడుతుంది. కాళ్లలో తీవ్రమైన నొప్పి బాధిస్తుంది.
మజిల్స్‌లో ఒత్తిడి కూడా కారణం
చాలా సందర్భాల్లో ఎక్కువగా నడవడం, పరుగెత్తడం లేదా వర్కవుట్స్ కారణంగా కూడా మజిల్స్ పెయిన్ రావచ్చు. మజిల్స్ ఒత్తిడి గురి కావచ్చు. లేదా కొత్తరకం ఆటలు ఆడినప్పుడు కూడా మజిల్స్ పెయిన్ సమస్య తలెత్తవచ్చు.
మజిల్ పెయిన్ ఎలా దూరం చేయాలి
మజిల్ పెయిన్స్ దూరం చేసేందుకు వేడి నీళ్లలో ఉప్పు వేసి కాస్సేపు ఆ నీటిలో కాళ్లు పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా హాయి కలుగుతుంది. లేదా వేడి నూనెతో కాళ్లకు మస్సాజ్ చేసినా మంచి ఫలితాలుంటాయి. వర్కవుట్స్ ఎప్పుడు చేసినా కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలి. పోషక పదార్ధాలతో నిండి ఉన్న డైట్ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే చాలావరకూ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజకు 7-8 గ్లాసుల మంచి నీళ్లు కచ్చితంగా తాగాలి. వేడి చేయకుండా ఉండేందుకు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
Also read; Garlic Benefits: వెల్లుల్లి రెండు రెమ్మలు చాలు..చలికాలం సమస్యలకు చెక్, మగవారి లైంగిక శక్తి కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Muscle pains: మజిల్ పెయిన్స్ బాధిస్తుంటే ఇలా చేయండి చాలు, ఎంత నొప్పైనా లాగేస్తుంది