Mushroom Benefits: పుట్టగొడుగుల వల్ల చర్మాని ఇన్ని లాభాలా..?

Mushroom Benefits: మష్రూమ్ పేరు చెప్పగానే నోరూరుతుంది. చాలా మంది మష్రూమ్స్‌ వంటకాలంటే ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి శరీరానికి మంచి ప్రయోజాలు ఇవ్వడమే కాకుండా చర్మ సంరక్షణకు దోహదపడదతాయి.  మష్రూమ్స్‌ చర్మానికి చేసే ప్రయోజనాలను చూస్తే ఆశ్చర్యపోతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 12:07 PM IST
  • పుట్టగొడుగుల వల్ల చర్మాని చాలా ప్రయోజనాలు
  • వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది
  • ముడతలను దూరం చేస్తుంది
Mushroom Benefits: పుట్టగొడుగుల వల్ల చర్మాని ఇన్ని లాభాలా..?

Mushroom Benefits: మష్రూమ్ పేరు చెప్పగానే నోరూరుతుంది. చాలా మంది మష్రూమ్స్‌ వంటకాలంటే ఇష్టపడి తింటూ ఉంటారు. ఇవి శరీరానికి మంచి ప్రయోజాలు ఇవ్వడమే కాకుండా చర్మ సంరక్షణకు దోహదపడదతాయి.  మష్రూమ్స్‌ చర్మానికి చేసే ప్రయోజనాలను చూస్తే ఆశ్చర్యపోతారు. మష్రూమ్ గురించి నేచురోపతికా వ్యవస్థాపకురాలు, సౌందర్య నిపుణురాలు బార్బరా క్లోజ్ ఈ విధంగా పేర్కొన్నారు. వీటిని 200 సంవత్సరాల క్రితం నుంచే చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారని వివరించారు. సున్నితమైన చర్మం కోసం, చర్మంపై మంటను తగ్గించడాని మష్రూమ్ సహాయపడుతుందని వారు తెలిపారు.  కాబట్టి చర్మ సంరక్షణలో పుట్టగొడుగులు ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.

చర్మానికి పుట్టగొడుగుల ప్రయోజనాలు:

వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది:

 ముఖంపై ఎలాంటి దద్దుర్లు, గాయాలు, గాయాలు, మొటిమలు మొదలైనవి ఉంటే..చర్మం కూడా మంటగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి..ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో చర్మంపై వాపు వేగంగా నయం అవుతుంది.

ముడతలను దూరం చేస్తుంది:

ఫిన్నిష్ చాగా(Finnish Chaga mushroom) జాతుల పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల చర్మంపై వృద్ధాప్యం, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలైన సమస్యలు దూరమవుతాయి.

స్కిన్ టోన్‌ను మార్చే గుణాలు:

మష్రూమ్‌లో కోజిక్ యాసిడ్ ఉన్నట్లు పరిశోధనలో తెలింది. ఇది చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించి స్కిన్ టోన్‌ను లైట్‌గా మార్చేందుకు దోహదపడుతుంది.

చర్మ చికాకు, దద్దుర్లును తొలగిస్తుంది:

షిటాకే(Shitake mushrooms) అని పిలువబడే ఒక ప్రత్యేక జాతి పుట్టగొడుగులో ఉండే గుణాలు చర్మంపై చికాకు, దద్దుర్లు, మంటలు మొదలైన సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

వైట్ బటన్ మష్రూమ్‌(White Button Mushroom)లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ కణజాలాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.

మొటిమలు తొలగిపోతాయి:

మొటిమల సమస్యలతో ప్రస్తుతం చాలా మంది బాధపడుతున్నారు. మొటిమలను వదిలించుకోవడానికి పుట్టగొడుగులను తీసుకుంటే.. అందులో ఉండే విటమిన్ డి మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Boiled Egg Benefits: రోజులో ఎన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు..నిజంగా గుడ్లు తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

Also Read: Clove Oil Benefits: లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News