Boiled Egg Benefits: గుడ్డు శరీరానికి చాలా మంచిది. అందుకే గుడ్డును సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. పెద్దలు వారంలో ఒక్కరోజైనా గుడ్డును తినమని సూచిస్తారు. అయితే గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు స్థాయి పెరుగుతుందని చాలా మంది గుడ్డును తినడం మానేశారు. అంతేకాకుండా ఇటీవలే అధ్యయనాలు కూడా వీటిని అధికంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని తెలుపుతున్నాయి. కావున రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసుకుందాం.
గుడ్లలో మంచి కొలెస్ట్రాల్ అధికం:
గుడ్లలో అధిక పరిమాణంలో ఉండే మంచి కొలెస్ట్రాల్ శరీర పనితీరుకు శక్తినందిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. గుడ్డులో మంచి కొవ్వు ఎంతుందో అంతే పరిమాణంలో చెడు కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది. కావున గుడ్లను అతిగా తింటే..హై బిపి, డయాబెటిస్, గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయి.
గుడ్డు ఆరోగ్యానికి మేలు:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కోడి గుడ్డులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో అధిక పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది సెల్ మెంబ్రేన్, ఈస్ట్రోజెన్, కార్టిసాల్, టెస్టోస్టెరాన్ వంటి ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది.
గుడ్లుకు, కొలెస్ట్రాల్ మధ్య సంబంధం:
గుడ్లులోని ఉండే పచ్చసొనలో దాదాపు 186 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది రోజులో 60 శాతం కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?:
ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది. మీరు ఎక్కువ పరిమాణంలో గుడ్లు తింటుంటే.. శరీరంపై ప్రభావం పడే అవకావాలున్నాయి.
ఈ వ్యక్తులు ఎక్కువ గుడ్లు తినవచ్చు:
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. కావున ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు రోజూ 2 నుంచి 3 గుడ్లు తినవచ్చు. టైప్ 2 డయాబెటిస్ రోగులు ప్రతిరోజూ సగటున ఒక గుడ్డు తింటే రక్తంలో చక్కెర స్థాయిపై ఎటువంటి ప్రభావం ఉండదని నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Diet: బరువు తగ్గలనుకుంటున్నారా..పొటాషియం పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోండి..!!
Also Read: Clove Oil Benefits: లవంగాల నూనెతో మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి