Nabhi Marma: చలికాలం చాలామంది శరీరానికి వెచ్చదనం పొందాడానికి అనేక రకాల చిట్కాలను వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆహారాల నుంచి మొదలుకొని దుస్తుల వరకు చలికాలంలో అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోషకాలు కలిగిన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా వాతావరణంలో తేమ ఒక్కసారిగా పెరిగినప్పుడు తప్పకుండా శరీరానికి వెచ్చదనం కలిగించే ఉన్ని దుస్తులను తప్పకుండా ధరించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన నాభి మర్మం అనే టిప్ ని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. నాభిపై ఆవనూనెను అప్లై చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభించడమే కాకుండా అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నాభి మర్మం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది:
శీతాకాలంలో నాభిపై ఆవ నూనెను రాసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆవనూనెలో ఉండే గుణాలు శరీరంలోని రక్త ప్రవాహాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని కాపాడుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కండరాల, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:
చలికాలంలో కండరాలు కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నావి చుట్టూ ఆవనూనెతో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా శీతాకాలంలో ప్రతిరోజు చేయడం వల్ల శాశ్వతంగా కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
చర్మానికి పోషణ అందిస్తుంది:
శీతాకాలంలో చాలామందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చర్మం పొడిబారిపోయి మంట, పగుళ్లు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా నాభి మర్మం చిట్కా ప్రభావంతంగా సహాయపడుతుంది. చలికాలంలో తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు నాభి చుట్టూ తప్పకుండా ఆవ నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి