Cholesterol Control: ఎటువంటి కొవ్వునైనా సులభంగా కరిగించే టీ…తయారీ విధానం

Fat Burning:  లావు, సన్నంతో సంబంధం లేకుండా బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. ఇలా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. మరి ఈ కొలెస్ట్రాల్ ని ఇంటి వద్ద సహజంగా దొరికే కొన్ని ఆకుల నుంచి చేసిన టీతో తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 10:34 AM IST
Cholesterol Control: ఎటువంటి కొవ్వునైనా సులభంగా కరిగించే టీ…తయారీ విధానం

Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఏర్పడే ఒక మైనం లాంటి పదార్థం. మన శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయి పెరగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒకరకంగా ఇది సైలెంట్ కిల్లర్ అని అనవచ్చు. మన శరీరంలో పెరిగే ప్రతి ఒక్క మిల్లీగ్రామ్ చెడు కొవ్వు కు ..గుండెపోటు వచ్చే అవకాశం ఒక శాతం పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా శరీరంలో చెడుసుకోలెస్ట్రాల్ పెరిగే కొద్దీ.. హైపర్‌టెన్షన్‌, గుండె సమస్యలు,కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, ఊబకాయం ,డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఇలాంటి సమస్యలు చాలా వరకు మనం తీసుకునే ఆహారం కారణంగానే తలెత్తుతాయి అంటున్నారు నిపుణులు. 

అందుకే మనం తీసుకునే డైట్ లో ఎక్కువ శాతం తాజా కూరగాయలు ,పండ్లు,ఆకుకూరలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట దొరికే స్టోర్ ఫ్యాట్ ఐటమ్స్ తక్కువగా తినాలి. వీటితోపాటు కొన్ని రకాల ఆకులతో చేసిన టీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సులభంగా తొలగిపోతుంది. మరి అవి ఏమిటో తెలుసుకుందాం ..

 
వేప

వేప ఆకుకు ఉన్న విశిష్టత మనకు అందరికీ తెలుసు. ఇందులో మెండుగా ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, లిపిడ్ రెగ్యులేటింగ్ గుణాల కారణంగా ఇది చెడు కొలెస్ట్రాల్ ని సులభంగా తగ్గిస్తుంది.  ఎండపెట్టిన వేప ఆకులను పొడి చేసి భద్రపరచుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి మరిగించాలి. రోజుకు రెండు మూడు సార్లుగా ఈ కషాయాన్ని కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. 

తులసి

ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. శుభ్రంగా కడిగిన తులసి ఆకులను ఎండపెట్టి గాజు డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రోజు ఒక గ్లాసు నీటిలో కాస్త ఎండ పెట్టిన తులసి ఆకులను వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక వడకట్టుకుని తాగాలి. కావాలి అనుకుంటే ఫ్రెష్ గా ఉన్న తులసి ఆకులను కూడా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గడంతో పాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ లోకి వస్తాయి.

నేరేడు

నేరేడు ఆకులలో ఆంథోసైనిన్‌లు, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా  ఉంటాయి ..వీటికి కొలెస్ట్రాల్ ను నియంత్రించే శక్తి ఉంది. తాజా నేరేడు ఆకులతో కషాయాన్ని కాసుకోవచ్చు లేదు అనుకుంటే ఆకులను శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని పొడిచేసి.. ఆ పొడిని కూడా వాడుకోవచ్చు. ఈ కషాయం కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది .కాబట్టి డయాబెటిస్ పేషంట్స్ కి ఇది చాలా మంచిది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు

Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News