Air Conditioner : రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

AC side effects : బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఏసీ గదిలో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. రాత్రులు కూడా వేడి గాలులు చిరాకు తెప్పిస్తున్నాయి. కానీ మీరు రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. అది మాత్రం చేయకండి. అలా చేస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సివస్తుంది.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 4, 2024, 11:00 PM IST
Air Conditioner : రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

AC Side Effects on Health: ఎండాకాలంలో పగలు మాత్రమే కాకుండా.. రాత్రులు కూడా ఏసీ వాడాల్సిన అవసరం వచ్చేసింది. సాయంత్రం కాదు రాత్రి అయినా కూడా.. వేడి గాలులు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాబట్టి చాలామంది ఉదయం నుంచి రాత్రి దాకా ఏసీ లోనే ఉంటున్నారు. అది చాలదు అన్నట్టు.. రాత్రి అంతా కూడా ఏసీ ఆన్ లోనే ఉంచి నిద్రపోతున్నారు. 

మనం రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతాం. కానీ అంతసేపు ఏసీలో ఉంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల.. లేదా నిద్రపోవడం వల్ల మన శరీరానికి మన ఆరోగ్యానికి కూడా చాలా హాని జరుగుతుంది. 

రాత్రి అంతా ఏసీలోనే పడుకుంటే ఉదయం పూట శరీరం చాలా వేడిగా అయిపోతుంది. ఏసీ వల్ల శరీరం బిగుతుగా అయిపోయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు ఏసీలో ఉండటం వల్ల మన ఎముకలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. మన శరీరం ఇక అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది.  ఏసీలో నిదురించే వారి లో శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తూఉంటాయి. ముఖ్యంగా దగ్గు, ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఏసీలో ఉండే అధిక చల్లదనం.. మన శరీరంలో ఉన్న ఉండే తేమను కూడా తగ్గించేస్తుంది. దానివల్ల చర్మం చాలా త్వరగా పొడిబారిపోతుంది. అసలే వేసవికాలం కారణంగా శరీరానికి కావాల్సిన నీటి శాతం అందదు. అది చాలదు అన్నట్టు.. ఏసీలో ఉంటే చర్మం ఇంకా పొడిబారిపోయి ముడతలు కూడా వచ్చేస్తాయి. 

ఏసీలోనే ఉండటం కారణంగా ఎలర్జీలు కూడా వచ్చి దురదలు, మచ్చలు వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. ఏసీ నుంచి వచ్చే దుమ్ము ధూళి కూడా ముక్కులోకి వెళ్లి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి పూట మూడు లేదా నాలుగు గంటలకు మించి ఏసీ ఆన్ చేసి ఉంచకూడదు అని నిపుణులు చెబుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News