Pre Diabetes Risk Factors: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే వారి ఈ వ్యాధి బారిన పడిన చిన్న చిన్న సాధారణ లక్షణాలు ఉండడం వల్ల గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి ఉపశమనం పొందితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి వీరు ముప్పను ముందుగానే గుర్తించి నియంత్రణ చర్యలు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా డైట్‌తో పాటు వ్యాయామాలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రీడయాబెటిస్ దశలో ఏమి జరుగుతుంది?
ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో రక్తప్రవాహం నుంచి చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు ఇన్సులిన్ ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. దీంతో రక్తంలో చక్కెర పరిమాణాలు విచ్చలవిడిగా పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రక్రియను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు.
ప్రీడయాబెటిస్, డయాబెటిస్ మధ్య తేడా?
ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో మధుమేహం సమస్యలు రాకపోవచ్చు.. కానీ ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం రాకుండా ఉపశమనం లభిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతే 5 నుంచి 15 రెట్లు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రీడయాబెటిస్ లక్షణాలు బాధపడేవారు మధుమేహం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ప్రారంభంలో ప్రీడయాబెటిస్‌ను గుర్తించడం చాలా కష్టం:
ప్రారంభ దశలో ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల టైప్ 2 డయాబెటిస్ దారి తీయోచ్చు. కాబట్టి ఆహారాలపై, జీవనశైలిపై శ్రద్ధ తీసుకోవడం వల్ల ప్రీడయాబెటిస్‌ను అరికట్టవచ్చు. ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో 10 శాతం మందిలో ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. మిగిత వారిలో ఇలాంటి మార్పులు రాకపోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రీడయాబెటిస్ వల్ల కలిగే లక్షణాలు:
1. బరువు పెరగడం
2. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం
3. అధిక రక్తపోటు
4. ఎక్కువ బరువున్న శిశువుకు జన్మనివ్వడం
5. టైప్ 2 మధుమేహం
దుష్ప్రభావాలు:
1. కంటి చూపు కోల్పోవడం
2. నరాల బలహీనత
3. గుండె జబ్బులు
4. కిడ్నీ దెబ్బతినడం
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook