Putnala Pappu Health Benefits In Telugu: కాల్చిన శనగలను ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్‌గా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అందుకే చాలామంది పుట్నాల పప్పుతో రకరకాల చిరుతిళ్లు, చట్నీలను తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ పుట్నాల పప్పుతో తయారుచేసిన ఏ ఆహార పదార్థాలు అయినా నోటికి రుచి అందించడమే కాకుండా శరీరానికి అనేక రకాల లాభాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పులో ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా ఈ పుట్నాల పప్పులు అధికమవుతాదిలో ఫైబర్ కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలతో పాటు శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు కడుపు నిండిన భావన కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు ఇందులో కొవ్వు పరిమాణాలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గిపోయి. చెడు కొవ్వు మంచి కొవ్వుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు ఈ పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు అధికం మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ పుట్నాల పప్పులలో శరీరానికి అవసరమైన పోషక గుణాలు మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి. అంతేకాకుండా గుండెకు మేలు చేసే అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని సాయంత్రం పూట స్నాక్స్‌గా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను కూడా నియంత్రించేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అంతేకాకుండా పుట్నాల పప్పులో లభించే ఫైబర్ పరిమాణాలు జీర్ణక్రియను మెరుగుపరచి పొట్ట సమస్యలు అయినా మలబద్ధకం, ఉబ్బరం, పొట్టనొప్పి వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో తీసుకోవడం వల్ల వాతావరణంలోని తేమ పెరగడం కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. కాబట్టి తరచుగా చలికాలంలో ఇన్ఫెక్షన్ల సమస్యలు, రోగ నిరోధక తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుట్నాల పప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter