Red Fruits and Vegetables: ఎరుపు రంగు చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఎర్రటి దానిమ్మ, టమేటా, ఆపిల్ లాంటి పండ్లు కంటికి ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఇలా ఎర్ర రంగులో ఉండే ఆహార పదార్థాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎరుపు రంగులో ఉండే పండ్లు కూరగాయలలో ప్రధానంగా లైకోపీన్, ఆంథోసైనిన్‌లు, బీటాలైన్ వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
హార్ట్ హెల్త్:
ఎర్ర రంగులో ఉండే కూరగాయలు, పండ్ల లో ఉండే లైకోపీన్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని నియంత్రణలో ఉంచుతుంది. పుచ్చకాయల్లో లభించే పొటాషియం గుండె జబ్బులను ఎదుర్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది అని అధ్యయనాల్లో తెలిసింది. ఈ ఫుడ్స్ వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
క్యాన్సర్ నివారణ:
రెడ్ ఫుడ్స్ లో సమృద్ధిగా లభించే యాంటీఆక్సిడెంట్స్ ,ఫ్రీ రాడికల్స్ శరీరం కు బలం చేకూరుస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్,ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి కొన్ని రకాల క్యాన్సర్ నివారణకు ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. రెగ్యులర్ గా ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మనకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది.
కంటి ఆరోగ్యం:
ఎరుపు రంగులో ఉన్న స్ట్రాబెరీ, పుచ్చకాయ, చెర్రీస్ వంటి పండ్లల్లో అధిక మోతాదులో విటమిన్ సి,యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. తరచూ రెడ్ ఫుడ్స్ తీసుకునే వారికి కంటి చూపు కూడా మెరుగుగా ఉంటుంది. సైట్ ఉన్నవాళ్లు కూడా క్రమం తప్పకుండా రెడ్ఫోర్ట్ తీసుకుంటే సైట్ మరింత పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
రోగనిరోధక శక్తి :
రెడ్ ఫుడ్స్ లో సమృద్ధిగా లభించే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు పలు రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter