Reduce Weight In 15 Days: డైటింగ్, వ్యాయామం లేకుండా కూడా ఊబకాయానికి 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..ఎలాగో తెలుసా?

How to Reduce Weight And Stay Fit: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 27, 2023, 04:05 PM IST
Reduce Weight In 15 Days: డైటింగ్, వ్యాయామం లేకుండా కూడా ఊబకాయానికి 15 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..ఎలాగో తెలుసా?

 

How to Reduce Weight And Stay Fit: ఆధునిక జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి చాలా మంది చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాల అలవాట్ల కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా బాడీ ఫిట్‌నెస్‌ను మెంటేన్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఊబకాయం సమస్యల బారిన పడి గుండెపోటు వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. హార్ట్ స్ట్రోక్  బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతి రోజు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించి పలు చిట్కాలు పాటిస్తే.  డైటింగ్, వ్యాయామం లేకుండా బరువు తగ్గొచ్చు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డైటింగ్, వ్యాయామం లేకుండా బరువు తగ్గడం ఎలాగో తెలుసా?
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి:

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల బరువు పెరగడమేకాకుండా తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

చక్కెర అతిగా ఉన్న ఆహారాలు తినొద్దు:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. 

నిద్ర తప్పని సరి:
బరువు తగ్గడానికి శరీరానికి తగినంత విశ్రాంతి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ప్రతి రోజు 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పూట స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. 

ప్రోటీన్ గల ఆహారాలు:
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రోటీన్స్‌ అధికంగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం క్రమం తప్పకుండా చికెన్‌, గుడ్లు డైట్‌లో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్యకరమైన స్నాక్స్:
సాయంత్రం పూట చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. వీటికి బదులుగా బీట్‌రూట్‌, గోసకాయలను స్నాక్స్‌గా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News