Rock Salt vs Table Salt: రాక్ సాల్ట్‌- సాధారణ ఉప్పు మీ ఆరోగ్యానికి ఏది మంచిది? 

Rock Salt vs Table Salt:మనం తీసుకునే ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యమైంది. ఉప్పు లేని ఆహారం నోట్లో పెట్టుకోలేం. అయితే, ఉప్పు ఎక్కువగా తింటే కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అంటారు. మన రోజువారీ ఆహారంలో సోడియం లెవల్స్ ఎంత తినాలో కొన్ని నియమాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 16, 2024, 03:07 PM IST
Rock Salt vs Table Salt: రాక్ సాల్ట్‌- సాధారణ ఉప్పు మీ ఆరోగ్యానికి ఏది మంచిది? 

Rock Salt vs Table Salt:మనం తీసుకునే ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యమైంది. ఉప్పు లేని ఆహారం నోట్లో పెట్టుకోలేం. అయితే, ఉప్పు ఎక్కువగా తింటే కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి అంటారు. మన రోజువారీ ఆహారంలో సోడియం లెవల్స్ ఎంత తినాలో కొన్ని నియమాలు ఉంటాయి.ఉప్పు అధికంగా తీసుకుంటే హైబీపీ వంటి సమస్యలు వస్తాయి. అయితే సాధారణంగా మన ఇళ్లలో రెండు రకాల ఉప్పులు ఉంటాయి. నిజానికికైతే ఉప్పులో 12 రకాలు కూడా ఉన్నాయంటారు. అయితే, రాక్ సాల్ట్‌ లేదా కల్లు ఉప్పు, సాధారణ ఉప్పు, లేదా టేబుల్ సాల్ట్‌  అని కూడా అంటారు. ఇది కాకుండా మనం పింక్ సాల్ట్‌ ను కూడా చూసే ఉంటాం. అయితే, రాక్ సాల్ట్‌, సాధారణ ఉప్పు ఎక్కువగా మన ఆహారంలో వినియోగిస్తాం. రోజువారీ ఆహారంలో ఏ ఉప్పు మంచిది? తెలురసుకుందాం.

రాక్ సాల్ట్‌..
మనం ఈ ఉప్పును కూడా అనేక ఆహారంలో ఇతర పనుల్లో వినియోగిస్తాం. దీన్నే మనం కల్లుప్పు అని కూడా పిలుస్తాం. ఇది సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడతారు.  ఈ ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం ఉంటుంది. ఓ నివేధిక ప్రకారం ప్రాసెస్ చేసిన సాధారణ ఉప్పు కంటే ఈ ఉప్పు మంచిది. అందుకే ఆహారంలో సాధారణ ఉప్పును వాడే బదులు ఈ రాక్ సాల్ట్‌ ను వాడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. చాలామంది ఇళ్లలో వాడుతారు కూడా. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

ఇదీ చదవండి: అల్లం టీతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. ఆడవారికి కూడా దివ్యౌషధం..

పింక్ సాల్ట్‌..
ఈ మధ్య కాలంలో ఈ పింక్ సాల్ట్‌ వినియోగం బాగానే పెరిగింంది. దీన్ని పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. దీన్ని హిమాలయ ఉప్పు గనుల నుండి సేకరించబడింది అందుకే ఇది గులాబీ రంగులో ఉంటుంది. మనం ఉపయోగించే సాధారణ ఉప్పు కంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. ఈ ఉప్పును వినియోగించడం వల్ల మన శరీరానికి సహజమైన ఖనిజాలు ,అవసరమైన సోడియం లభిస్తుంది.

సాధారణ ఉప్పు..
సాధారణంగా మన ఇళ్లలో ప్రతిరోజూ వాడి తెల్లని సన్న ఉప్పును సాధారణ ఉప్పు లేదా టేబుల్ సాల్ట్‌ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే హై బ్లడ్ ప్రెజర్ సమస్యలు వస్తాయి. దీన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ వినియోగం తెలిసి ఉండి ఈ ఉప్పును వాడాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు.
కానీ, మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ ఉప్పు వినియోగం ఎక్కువగా ఉంది. దీన్ని తెలుసుకుని రానురాను తగ్గించుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ టేబుల్ సాల్ట్‌ను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. 

ఇదీ చదవండి:  మధుమేహాన్ని నియంత్రించే మెంతికూర పకోడా రెసిపీ..

ఏ ఉప్పు సరైనది?
ఉప్పు లేని కూడా చప్పగా ఉంటుంది. ఇది మన ఆహారంలో చాలా ముఖ్యమైంది. అయితే, మన ఆరోగ్యానికి ఏ ఉప్పు ఉపయోగపడుతుందో దాన్ని చేర్చుకోవడం ముఖ్యం. సాధారణంగా, అన్ని రకాల ఉప్పును మితంగా వాడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒక వ్యక్తి రోజుకు 2,300 మిల్లీగ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News