Benefits Of Eating Rose Petals: గులాబీ రేకులు అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగపడతాయి. గులాబీ రేకులలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో నాటు గులాబీలు (దేశవాళీ గులాబీలు) ఎంతగానో ఉపయోగపడతాయి.
గులాబీ రేకులు తింటే కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
గులాబీ రేకులను నమలడం వల్ల జీర్ణక్రియ సులభమవుతుంది. ఇవి శరీరంలోని వ్యర్ధపదార్ధాలను తొలగించి బరువును నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
గులాబీ రేకులను రోజు వారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు సులభంగా కోల్పోతారు.
చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
గులాబీ పువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్ చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
గులాబీ రేకులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది:
గులాబీ రేకులలో లైంగి సామర్థ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయి.
మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది:
గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
శరీరంలోని చెడు కొవ్వులను తగ్గిస్తుంది:
గులాబీ రేకులతో తయారైన కషాయాన్ని తీసుకోవటం వల్ల శరీరంలోని చెడు కొవ్వులు తగ్గుతాయి.
పుళ్ళను మాన్పిస్తుంది:
చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేయడమే కాకుండా వాటిని తొందరగా తగ్గుతాయి.
పైల్స్ సమస్యను తగ్గిస్తుంది:
ఇందులో ఉండే పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.
గులాబీ రేకులను ఎలా ఉపయోగించవచ్చు?
గులాబీ రేకులతో టీ తయారు చేసుకోవచ్చు.
గులాబీ రేకులను సలాడ్‌లలో వాడవచ్చు.
గులాబీ రేకులను వంటల్లో వాడవచ్చు.
గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు.
గులాబీ రేకులతో బాత్ సాల్ట్‌లు తయారు చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
గులాబీ రేకులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, గులాబీ రేకులను ఉపయోగించే ముందు డాక్టర్‌ను సంప్రదించండి.
గులాబీ రేకులకు అలర్జీ ఉంటే వాడకూడదు.
గులాబీ రేకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు. కాబట్టి, మితంగానే ఉపయోగించడం మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.