Seasonal Diseases: ఎలాంటి తీవ్రమైన సీజనల్ వ్యాధులైన ఈ చిట్కాలతో 20 నిమిషాల్లో మటు మాయం..

Seasonal Diseases: వాతావరణం లో తేమ పెరగడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు దగ్గు తలనొప్పి వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2023, 09:53 PM IST
Seasonal Diseases: ఎలాంటి తీవ్రమైన సీజనల్ వ్యాధులైన ఈ చిట్కాలతో 20 నిమిషాల్లో మటు మాయం..

Seasonal Diseases: చలి తీవ్రత వల్ల వాతావరణంలోని తేమ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే చాలామంది ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే మందులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల త్వరగా ఉపశమనం పొందిన ఏమాత్రం శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి తప్పకుండా రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వీటిని జలుబు, దగ్గు ఉన్నవారు వినియోగిస్తే త్వరలోనే ఫలితం పొందుతారు:

థైమ్ టీ:
థైమ్‌లో ఉండే యాంటీవైరల్, యాంటీబయాటిక్ లక్షణాలు జలుబు, దగ్గు వంటి అంటు వ్యాధులతో పోరాడుతాయి. కాబట్టి చలికాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు శరీర రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు తప్పకుండా ఈ టీ ని తాగండి. దీనిని తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

తులసిని వినియోగించండి:
తులసిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా అంటువ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.. కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో దీనిని గొప్ప మొక్కగా పేర్కొన్నారు. దగ్గు జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి ఆకులతో తయారుచేసిన దీని రెండుసార్లు తాగితే సులభంగా మీరే ఫలితం పొందుతారు. 

ఉడికించిన రోజ్మేరీ ఆకులు:
రోజ్మేరీ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని ఆయుర్వేద నిపుణులు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వినియోగించేవారు. అయితే సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న వారు ఈ ఆకుల తో తయారుచేసిన కషాయాన్ని తాగితే సులభంగా ఉపశమనం పొందుతారు.

దాల్చిన చెక్క కషాయం;
దాల్చిన చెక్కతో చేసిన పొడిని టీ లా తయారు చేసుకొని ప్రతిరోజు తాగితే శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. కాబట్టి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టీని రెండు పూటలా తాగాల్సి ఉంటుంది. 

Also read: Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి

Also read: Income tax Slabs: ఇన్‌కంటాక్స్ స్లాబ్ ఎన్ని రకాలు, ఏ ప్లాన్‌లో ఎంత ట్యాక్స్ చెల్లించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News