Aloe Vera Gel: ప్రతి రోజు అలోవెరాను ఇలా వినియోగిస్తున్నారా? ప్రమాదమే..

Side Effects Of Aloe Vera On Health And Beauty: ప్రతి రోజు అలోవెరా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2023, 12:22 PM IST
 Aloe Vera Gel: ప్రతి రోజు అలోవెరాను ఇలా వినియోగిస్తున్నారా? ప్రమాదమే..

 

Side Effects Of Aloe Vera On Health And Beauty: మచ్చలు, మొటిమలు లేని చర్మాన్ని పొందడానికి అందరు అలోవెరా జెల్‌ను వివియోగిస్తూ ఉంటారు. అలోవెరా జెల్‌లో ఉండే పాలీఫెనాల్స్ ముఖంపై గాయాలను తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి దీని చర్మానికి వినియోగించడం వల్ల తీవ్ర చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని వినియోగం వల్ల చాలా లాభాలున్నాయని కొంతమంది మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు అతిగా వినియోగించడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. 

అలోవెరా జెల్‌ను అతిగా వినియోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
పొట్ట సమస్యలు:

కలబంద ఆకులలో ఉండే జిగురు లాంటి మిశ్రమం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అలర్జీ,  కడుపులో మంట, తిమ్మిర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో పొటాషియం పరిమాణాలు కూడా అతి తక్కువగా లభిస్తాయి. 

డీహైడ్రేషన్ సమస్యలు:
అలోవెరా జెల్‌లో అధిక పరిమాణంలో ఆయుర్వేద గుణాలు లభిస్తాయని అతిగా వినియోగించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్యలకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరిలో డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

చక్కెర పరిమాణాలు తగ్గే ఛాన్స్‌:
మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు అలోవెరాను ప్రతి రోజు వినియోగించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

క్రమరహిత హృదయ స్పందన:
ప్రతి రోజు కలబంద రసం తాగడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా క్రమరహిత హృదయ స్పందన, శరీర బలహీనత, అలస వంటి సమస్యలు కూడా రావచ్చు. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News