Kidney stones: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్‌తో ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీలో రాళ్లు. ఆహారపు అలవాట్లు, బిజీ లైఫ్ కారణంగా కిడ్నీ సమస్య ఎక్కువవుతోంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు..కిడ్నీలో రాళ్లు తొలగించవచ్చు.
జీవితాన్ని బిజీగా మార్చుకునే కొద్దీ అనారోగ్య సమస్యలు (Health problems)అధికమవుతున్నాయి. దైనందిన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీలో రాళ్లు. చికిత్స ఉన్నా సరే ఆందోళన కల్గించే సమస్యగా మారింది. ఎందుకంటే నూటికి 50 శాతం మందిలో అదే సమస్య కన్పిస్తోంది. కిడ్నీలో రాళ్లనేవి రాకుండా చూసుకుంటే మరీ మంచిది. ఒకవేళ వచ్చినా సరే నిత్య జీవితంలో చిన్నమార్పులతో కిడ్నీలో రాళ్లు రాకుండా చేయవచ్చు.
కిడ్నీలో రాళ్లు (Kidney stones)ఏర్పడకుండా ఉండాలంటే కాల్షియం (calcium)అధికంగా ఉండే పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి, అలాగని పూర్తిగా మానేయకూడదు. రోజువారీ ఆహారంలో ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్స్‌ని పూర్తిగా మానేయాలి. లెమన్ సాల్ట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరం. శరీరంలో మెగ్నీషియం పెంచుకోవాల్సి ఉంటుంది. కాల్షియం ఆక్సోలేట్ అనేది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇక ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా మాంసం, పోర్క్, చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ముందు యూరిక్ యాసిడ్ (Uric Acid)ను నియంత్రణలో ఉంచాలి. ఇక ఫాస్పేట్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్‌ను మానేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 12 గ్లాసుల నీరు తప్పకుండా తీసుకోవాలి. జ్యూస్ రెగ్యులర్‌గా తాగాలి కానీ పంచదార తగ్గించేయాలి.
Also read: Sputnik V Vaccine: అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook