Sudden Heart Attack: ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలే చాలా మందిలో సడెన్ కార్డియాక్ అరెస్ట్ దారీ తీస్తున్నాయి. దీని కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని ఓ అధ్యయనంలో తెలింది. నిద్రలేమి సమస్యల కారణంగా ఇలాంటి సమస్యలే కాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో మార్పలు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ పరిశోధన ప్రకారం.. తక్కువ నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరుగుతుందని పేర్కోన్నారు. కాబట్టి ప్రతి రోజు 7 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్యల కారణంగా శరీరంలోని ఎండోథెలియల్ కణాలు స్థాయిలు తగ్గిపోయి. గుండె ధమనుల విస్తరణ కూడా తగ్గిపోతోంది. దీని కారణంగా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుంది. గుండె జబ్బులతో బాధపడేవారిలో నిద్రలేమి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తప్పకుండా నిద్ర పోవాల్సిందేనా?:
సాధరణంగా పెద్దలు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. పిల్లలు, యువకులకు దీని కంటే ఎక్కువ నిద్రపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిద్రపోవడం వల్ల మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ప్రతి రోజు తగినంత నిద్రపోవడం వల్ల శరీర ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు మంచి నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook