డిస్లెక్సియాకి బ్రెయిన్ ట్రైనింగే ముఖ్య ఔషధం

కొందరు పిల్లలకు చదవడం, రాయడంలో విపరీతమైన ఇబ్బంది ఉంటుంది.

Last Updated : Mar 8, 2018, 07:41 PM IST
డిస్లెక్సియాకి బ్రెయిన్ ట్రైనింగే ముఖ్య ఔషధం

కొందరు పిల్లలకు చదవడం, రాయడంలో విపరీతమైన ఇబ్బంది ఉంటుంది. మామూలు పిల్లల్లా కాకుండా.. వారు చదివే, రాసే పద్ధతుల్లో కాస్త వెనుకబడి ఉంటారు. ఈ రుగ్మతనే డిస్లెక్సియా అంటారు. అయితే అలాంటి పిల్లలకు బ్రెయిన్  ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. స్పెయిన్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు దాదాపు 72 మంది పిల్లలను పరిశీలించి, పలు అధ్యయనాలు చేసి డిస్లెక్సియా సమస్యకు పరిష్కారం కనిపెట్టామని చెప్పారు.

ముఖ్యంగా చదివే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలకు ముందుగా మాట్లాడడం బాగా నేర్పించాలని.. వివిధ అంశాలు ఇచ్చి వాటిపై మాట్లాడే తర్ఫీదును వారికి ఇవ్వాలని పరిశోధకులు తెలిపారు. అలాగే భాషపై పట్టు పెంచే ఉపకరణాలను వారికి పరిచయం చేయాలని కూడా తెలిపారు. అలాగే ఈ విషయంలో పిల్లల వినికిడి సామర్థ్యాన్ని కూడా కచ్చితంగా పరీక్షించాలని అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ విద్యార్థులకు ఇచ్చే ట్రైనింగ్‌తో పోల్చుకుంటే డిస్లెక్సియా బారిన పడిన పిల్లలకు ఇచ్చే ట్రైనింగ్ చాలా వైవిధ్యంగా ఉండాలని.. ఆ బ్రెయిన్ ట్రైనింగ్ పిల్లలకు బోర్ కలిగించకుండా.. వినోదాన్ని కలిగించాలని పరిశోధకులు తెలిపారు. 

 

Trending News