కళ్ళకలక బారి నుంచి బయటపడే చిట్కా..

Last Updated : Oct 10, 2017, 01:43 PM IST
కళ్ళకలక బారి నుంచి బయటపడే చిట్కా..

ఇది వర్షాకాలం.. పల్లెలు, నగరాలు అంటూ తేడా లేకుండా వర్షానికి తడిసిముద్దవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే జలదిగ్భందంలో రహదారులు, అస్తవ్యస్త రాకపోకలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు .. ఇది నాణేనికి ఒకవైపైతే ఆరోగ్య సమస్యలు మరోవైపు. వర్షాకాలంలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలలో కంటి సమస్య ఒకటి. ఇలాంటి సమయంలోనే కంటికి ఇన్ఫెక్షన్ వస్తుంది.  అందుకే వర్షాలు పలకరిస్తున్న ఈ కాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యల నుండి దూరంకావచ్చు..!

1. చేతులను శుభ్రంగా కడుక్కొని కళ్లను తాకండి. మురికి చేతులతో తాకొద్దు. 

2. వాన నీటితో నిండిన వీధుల్లో పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడుతారు. అలాంటి సమయంలో తగు జాగ్రత్త వహించడం మంచిది. 

3. ఒకటికన్నా ఎక్కువ కళ్ళజోడు ఉన్నవాళ్లు ముందుజాగ్రత్త చర్యగా అదనంగా వెంట ఒకటి తీసుకెళ్లండి. 

4. మీరు ఇతరుల టవాల్ ను లేదా ఇతరులు మీ టవాల్ ను వాడకుండా ఉండేట్లు చూసుకోండి.  

5. కళ్లు తుడుచుకునేటప్పుడు కర్చీఫ్ కన్నా డిస్పోజబుల్ టిష్యులు వాడితే కంటి ఇన్ఫెక్షన్ కు దూరంగా ఉండవచ్చు. 

6. మీ దేహాన్ని, చేతులను తుడిచిన టవాల్ తో కళ్లను  తుడవద్దు.  అందులో ఉండే సూక్షజీవులు మీ కళ్లకు హానికలిగించే ఆస్కారం ఉంది. 

7. బయటి నుండి ఇంటికి రాగానే ముఖం, చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోండి. 

8. కళ్లలో దుమ్ముపడినప్పుడు అదేపనిగా రుద్దవద్దు. కళ్లను చల్లని నీటితో మృదువుగా కడుక్కోండి. 

9. వానాకాలంలో వచ్చే కండ్లకలక వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే కళ్లను శుభమైన నీటితో కడిగి వేడికాపాడం పెట్టాలి. వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించాలి.  

10. వానాకాలంలో బ్యాక్టీరియా కారణంగా కంటికింది కనురెప్ప లోపల పుండు ఏర్పడుతుంది. దీన్నే స్టై అంటారు. దీనికి వేడి కాపడం పెట్టడంతో పాటు తక్షణ చికిత్స చేసుకోవాలి. 

Trending News