Five Fruits for Disease Free: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా మన ఆహారంలో ప్రతీరోజూ పండ్లు తప్పనిసరిగా ఉండాలి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో ఉండే పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి బలంగా ఉంటేనే శరీరం రోగాల బారినపడకుండా ఉంటుంది. ఏదైనా వ్యాధి బారినపడినా త్వరగా కోలుకోవచ్చు. ఇప్పుడిక్కడ చెప్పబోయే ఐదు రకాల పండ్లను మీ డైట్‌లో చేర్చుకుంటే కొన్ని వ్యాధులు మీ దరి చేరకుండా ఉంటాయి.
బత్తాయి పండ్లు :
బత్తాయి పండ్లలో విటమిన్ సి ఉంటుంది, ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ రెండు మూడు బత్తాయి పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
బెర్రీ పండ్లు :
మీరు జ్వరంతో బాధపడుతున్నట్లయితే.. మీ డైట్‌లో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు చేర్చుకుంటే మంచిది. బెర్రీస్‌లో ఫైబర్‌తో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని జ్యూస్‌గా కూడా చేసుకోవచ్చు. తద్వారా త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు.
మామిడి పండ్లు :
మామిడి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కీవీ పండ్లు :
కీవ్‌లో విటమిన్ సి, ఇ ఉంటాయి. కివీలో పొటాషియం కూడా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
నిమ్మరసం :
జ్వరం వస్తే నిమ్మరసం తాగాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వైరస్ ప్రభావాన్ని కొంత వరకు తగ్గించే శక్తి దీనికి ఉంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలపుకని తాగితే ఆరోగ్యానికి మంచిది. మీరు అల్పాహారం తర్వాత లేదా సాయంత్రం నిమ్మరసం తీసుకుంటే మంచిది. రాత్రిపూట నిమ్మ రసం తీసుకోకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook