Dangerous Diseases: ఆధునిక జీవవశైలిలో పలు అనారోగ్య సమస్యలు తరచూ వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ అధ్యయనం జీర్ణించుకోలేని అంశాలను రుజువు చేసింది. ఈ అధ్యయనం అంతా అల్ట్రా ప్లోసెస్డ్ ఫుడ్స్ గురించే. ఇవి తినడం వల్ల ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు సంభవిస్తాయి.
ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు, కేన్సర్, టైప్ 2 డయాబెటిస్, మానసిక ఆరోగ్యం వంటి ప్రమాదకర, ప్రాణాంతక సమస్యలు ఎక్కువౌతున్నాయి. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో వివిధ రకాల పరిశోధనల గణాంకాలు తోడయ్యాయి. గత కొద్దికాలంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం ఎక్కువైంది. వీటిలో ప్యాకెట్ ఫుడ్స్, ప్రోటీన్ బార్, ఫ్రిజ్ ఫుడ్స్ వంటివి చాలా ఉన్నాయి. బ్రిటన్, అమెరికాలో సగం కంటే ఎక్కువమంది అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు.
అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్ అనేవి మనిషి ఆరోగ్యానికి చాలా హానికరం. దాదాపు 1 కోటి మందిపై జరిపిన అధ్యయనంలో అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్ వల్లనే ప్రమాదకర వ్యాధులు ఎదురౌతున్నాయని తేలింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ , ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ యూనివర్శిటీ, ఫ్రాన్స్‌కు చెందిన సోర్‌బోన్ యూనివర్శిటీ సహా చాలా సంస్థల నిఫుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్ కారణంగా కేన్సర్, మెంటల్ హెల్త్, గుండె వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, మెటబోలిజం సహా 32 రకాల ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు ఎదురౌతున్నాయి.
అల్ట్రా ప్రోసెస్డ్ ఫుడ్స్‌లో స్నాక్స్, ఫ్రిజీ డ్రింక్స్, షుగర్ సెరెల్స్, రెడీ టు ఈట్, రెడీ మీల్స్ చాలానే ఉన్నాయి. ఇందులో కలిపే రంగులు, ఇమల్సిఫైయింగ్ ఏజెంట్లు, ఫ్లేవర్స్, వంటివి చాలానే ఉన్నాయి. ఈ ఆహార పదార్ధాల్లో విటమిన్లు, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి.
Also read: Grapes Benefits: ద్రాక్ష పండ్లు రోజూ తీసుకుంటే ఈ వ్యాధులన్నీ దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook