How to Maintain Uric Acid Level in Body: ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా తలెత్తుతున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి యూరిక్ యాసిడ్. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే వివిధ రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేస్తే ఆర్థరైటిస్‌కు దారి తీయవచ్చు.
ఈ మధ్య కాలంలో యూరిక్ యాసిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. శరీరంలో ఉండే ప్యూరిన్ అనే పదార్ధం విరగడం ద్వారా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాదారణంగా ఇది యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంటుంది. కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మాత్రం అది కాస్తా క్రిస్టల్ రూపంలో ఏర్పడి జాయింట్స్‌లో పేరుకుంటుంది. దాంతో ఆర్థరైటిస్ అనే ప్రమాదకర వ్యాధికి దారి తీస్తుంది. ఫలితంగా జాయింట్ పెయిన్స్, కీళ్ల కదలికలో ఇబ్బంది ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది
యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. కుటుంబంలో ఎవరికైనా ఆర్ధరైటిస్ సమస్య ఉంటే మీక్కూడా ఆ ముప్పు ఉంటుంది. దాంతో పాటు రెడ్ మీట్, చేపలు, మద్యం తీసుకునే అలవాటుండేవారికి, స్థూలకాయం, డయాబెటిస్, డ్యూరెటిక్స్, రక్తపోటు, థైరాయిడ్, కిడ్నీ వ్యాదులతో బాధపడేవారికి యూరిక్ యాసిడ్ పెరుగుతుంటుంది. యూరిక్ యాసిడ్ అనేది సాధారణంగా మగవారిలో ప్రతి డెసీలీటర్‌కు 7 మిల్లీగ్రాముల వరకూ ఉండవచ్చు. అదే మహిళలకు అయితే 6 మిల్లిగ్రాముల వరకూ ఉండాలి.
యూరిక్ యాసిడ్ ఎలా నియంత్రించాలి
యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు చిక్కుడు కాయలు, డ్రై మటర్, చిలకడదుంప, కాలిఫ్లవర్, పాలకూర, మష్రూం, గ్రీన్ మటర్, ఆర్గాన్ ఫుడ్స్, రెడ్ మీట్ వంటివి వీలైనంతవరకూ తగ్గించాలి. అదే సమయంలో బరువు తగ్గించడంపై ప్రధానంగా దృష్టి సారించాలి. అధిక బరువు తగ్గించడం అనేది ఎప్పుడూ మంచిదే. రోజూ తగినంతగా వ్యాయామం చేయడం, బ్యాలెన్సింగ్ డైట్ ద్వారా తగ్గించవచ్చు.
కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీ తాగేవారిలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఆర్ధరైటిస్ వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అంటే కాఫీ యూరిక్ యాసిడ్ సమస్యకు పరిష్కారం కావచ్చు. విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా డైటరీ పైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
Also read: Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు లాంచ్ తేదీ వచ్చేసింది, ఎప్పట్నించి ఏ మార్గంలో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook