శరీర నిర్మాణంలో విటమిన్లు, ప్రోటీన్ల పాత్ర కీలకం. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా రకాల పోషకాలు అవసరం కాగా..అందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 అనేది ఎనీమియాను సైతం దూరం చేస్తుంది. విటమిన్ బి12 లోపాన్ని సరిచేసేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో పరిశీలిద్దాం.
వైట్ ఫుడ్స్
విటమిన్ బి12 లోపాన్ని దూరం చేసేందుకు డైట్‌లో పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను సేవించాల్సి వస్తుంది. ఈ వస్తువుల్ని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపం దూరమౌతుంది. మీకు తరచూ అలసట సమస్య ఎదురౌతుంటే..విటమిన్ బి12 లోపమున్నట్టు అర్ధం చేసుకోవాలి. విటమిన్ బి12 లోపముంటే పాల ఉత్పత్తుల్ని డైట్‌లో చేర్చుకోవాలి.
పండ్లు, కూరగాయలు
విటమిన్ బి12 లోపంతో బాధపడేవాళ్లు డైట్‌లో చామ, బంగాళదుంప, మష్రూమ్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. దీంతో పాటు మటర్‌లో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలతో పాటు నాన్‌వెజ్ తినేవారైతే చేపలు, మాంసం, గుడ్లు డైట్‌లో భాగంగా చేసుకుంటే విటమిన్ బి12 లోపం తొలగిపోతుంది.
ఓట్‌మీల్, తృణధాన్యాలు
ఓట్‌మీల్‌లో విటమిన్ బి12 పెద్దమొత్తంలో ఉంటుంది. దీనికోసం డైట్‌లో ఓట్‌మీల్‌తో పాటు మజ్జిగ, కార్న్‌ఫ్లెక్స్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇక తృణధాన్యాల్లో సైతం పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 సహా ఇతర విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి12 లోపాన్ని సరిజేసేందుకు తృణధాన్యాలు మంచి ప్రత్యామ్నాయం కాగలవు.
Also read: Holi Skin Care Tips: హోళీ వేడుకల తరువాత ఇలా స్నానం చేస్తే ఏ చర్మ సమస్యలు తలెత్తవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Vitamin B12: శరీరానికి విటమిన్ బి12 ఎందుకు అవసరం, ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి