Vitamin C Benefits: ఆరోగ్యమైన జీవనాన్ని గడపడానికి శరీరానికి పోషకాలు, ఖనిజాలు చాలా అవసరం ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు విటమిన్ సి లోపం సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా కొంత మంది ఈ లోపం ఉన్నవారు శరీరంపై అశ్రద్ధ వహిస్తారు. అయితే ఇలా చేయడం వల్లే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే విటమిన్ లోపం సమస్యలతో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విటమిన్ సి లోపం బాధపడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తరచుగా అనారోగ్యానికి గురికావడం:
విటమిన్ సి శరీరంలో తగిన పరిమాణంలో ఉంటేనే తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీ చర్మం, రక్తనాళాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గాయలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్యానికి గురవుతున్నవారు తప్పకుండా విటమిన్ పరీక్ష చేయించుకోవాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడొచ్చు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
విటమిన్ సి లోపం ఉన్నవారు వీటిని డైట్లో తీసుకోవాలి:
ఇప్పటికే విటమిన్ సి లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్లో ఆరెంజ్, లెమన్, సీజనల్ ఫ్రూట్స్ ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు బెర్రీస్, బ్రొకోలీ, జామ మొదలైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఈ లోపం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మానసిక స్థితి సమస్యలు కూడా రావొచ్చు:
శరీరంలో తగిన పరిమాణంలో విటమిన్ సి లేకపోవడం వల్ల చాలా మందిలో డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. విటమిన్ సి లోపంపై శ్రద్ధ చూపకపోతే తీవ్ర రక్తపోటు, రక్తహీనత సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు పొడిగా కూడా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook