Vitamin D: విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యమైంది. శాకాహారులకు విటమిన్ డి ఎందులో లభిస్దుందనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఏ ఆహార పదార్ధంలో విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుందో చూద్దాం..
విటమిన్ డి శరీరానికి అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం జీర్ణం చేసుకునేందుకు ఎముకల్ని బలంగా ఉంచేందుకు చాలా అవసరం. విటమిన్ డి వల్ల దంతాలు కూడా పటిష్టమౌతాయి. మాంసాహారులకైతే విటమిన్ డి చాలా ఆహార పదార్ధాల్లో లభిస్తుంది. కానీ శాకాహారులకు ఏ ఆహార పదార్ధాల ద్వారా లభ్యం కానుందో చూద్దాం..శరీరానికి కావల్సిన విటమిన్ డి అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజూ ఓ అరగంట ఎండలో నిలుచోవాలి. ఇలా చేస్తే ఎముకలు బలోపేతమవుతాయి.
శాకాహారులకు విటమిన్ డి లభించే పదార్ధాలు
పాలలో కావల్సినంత కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. దాంతోపాటు పాలను ఓ సంపూర్ణ ఆహారంగా భావించవచ్చు. ఇందులో అన్ని రకాల పోషకాలున్నాయి. ఇందులో ప్రోటీన్లున్నాయి. అందుకే విటమిన్ డి కోసం మీ డైట్లో పాలను భాగస్వామిగా చేర్చుకోండి.
ఇక పెరుగు వల్ల శరీరానికి చలవ చేస్తుంది. దాంతో పాటు డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. డైరీ ఉత్పత్తులంటే ఎలర్జ ఉన్నవారికి ఇదొక ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కేలరీలు సంపూర్ణంగా ఉంటాయి. పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి పూర్తిగా లభిస్తుంది.
మష్రూమ్స్ అనేవి విటమిన్ డికు కీలకమైనవి. మష్రూమ్స్‌ని మీరు సూప్ లేదా సలాడ్‌గా డైట్‌లో యాడ్ చేయవచ్చు. ఇక ఆరెంజ్ జ్యూస్‌లో కూడా విటమిన్ డి సమృద్ధిగానే ఉంటుంది. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం తలెత్తదు.
Also read: Full Body Pain Reason: తరుచుగా శరీర నొప్పులతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook