Weight Loss Diet: బరువు పెరగడం కూడా ఒక అనారోగ్య సమస్యే. ప్రస్తుతం భారత్ లో ప్రతి 50 మందిలో 25 మంది బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది బరువు పెరగడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలన్నిటికీ ఇంటి చిట్కాలు ద్వారా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలకు ఏలకుల టీ ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కాబట్టి చాలామంది వీటిని వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అంతేకాకుండా ఏలకులను మౌత్ ఫ్రెష్ గా కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే మూలకాలు మౌత్ ను ఎల్లప్పుడూ ఫ్రెష్ గా ఉండేందుకు ప్రభావంతంగా కృషి చేస్తాయి. అయితే ఈ టీ ని వినియోగించి ఎలా బరువు తగ్గాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఏలకుల టీ తో సులభంగా బరువు తగ్గొచ్చు:
హెల్త్ షార్ట్స్ అనే నివేదిక ప్రకారం ఏలకుల టీ ఆకలిని నియంత్రించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి పొట్ల చుట్టూ పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలైనా అజీర్ణం, మలబద్దకం మొదలైన వాటి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి ఈ టీని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి.
ఈటీని ఎలా తయారు చేసుకోవాలి..?:
యాలకుల టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఐదు నుంచి ఆరు యాలకులతో చేసిన పొడిని తీసుకోవాలి. అయితే ఈ పొడిని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరికి ఈ టీలో తేనెను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ టీవీ క్రమం తప్పకుండా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా సులభంగా బరువు తగ్గుతారు.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook