Weight Loss Tips In Telugu: ఆధునిక జీవనశైలి కారణంగా రోజురోజుకు ఊబకాయం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలామంది గంటల తరబడి చేయడం ఆహారపు కఠినమైన డైట్లు పాటించడం వంటివి చేయిస్తున్నారు. అయినప్పటికీ పొట్టపై కొవ్వు, స్థూలకాయాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. నిజానికి శరీర బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు ముందుగా చేయాల్సింది ఆహారాలపై దృష్టి సాధించడం, అలాగే దినచర్యలో మార్పులు చేసుకోవడం. ఇలా వీటి రెండిటిలో కఠినమైన మార్పులు చేయడం వల్ల ఎంతో సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పద్ధతులను అనుసరించడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.
బరువు తగ్గడం అనేది ముందుగా ఉదయం లేవగానే చేసే కొన్ని పనులపై కూడా ఆధారపడి ఉంటుంది. చాలామంది బరువు తగ్గే క్రమంలో ఉదయం నిద్ర చాలా లేటుగా లేస్తూ ఉంటారు. నిజానికి రాత్రి సరైన సమయంలో పడుకొని ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో నిద్ర లేవడం వల్ల మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే చాలామంది మొబైల్ చూస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువగా మొబైల్స్ చూడడం వల్ల కళ్ళు చెడిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాకుండా ఉదయం లేచి ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఉదయం లేవగానే ముందుగా ఈ క్రింది పనులు చేయాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఉదయం లేచిన వెంటనే కనీసం 40 నిమిషాల వరకు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో 30 నిమిషాలు యోగాసనాలు లేదా ఎక్సర్సైజ్ చేయడం ఎంతో మంచిది. అలాగే ప్రతిరోజు తీసుకుని అల్పాహారంలో కూడా ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బరువు తగ్గాలనుకునేవారు రాత్రి 12:00 నుంచి ఉదయం 5 గంటల వరకు మంచి గాడమైన నిద్రపోవాల్సి ఉంటుంది. దీని కారణంగా శరీరానికి తగినంత విశ్రాంతి లభించడమే కాకుండా బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారు. బరువు తగ్గే క్రమంలో అర్ధరాత్రి వరకు మేల్కోవడం వల్ల హార్మోన్ల సమస్యలు పెరిగి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఏదైనా తినాలని కోరికలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి శరీరం హైడ్రేటెడ్ గా కూడా ఉండాల్సి ఉంటుంది. దీనికోసం తప్పకుండా రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీటిని తాగాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి