Omicron XE Variant: ఇది మరీ ప్రమాదకరమా..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron XE Variant: కరోనా సంక్రమణ మరోసారి వెంటాడుతున్నట్టుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ కంటే పదింతలు వేగమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2022, 12:43 PM IST
Omicron XE Variant: ఇది మరీ ప్రమాదకరమా..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Omicron XE Variant: కరోనా సంక్రమణ మరోసారి వెంటాడుతున్నట్టుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ కంటే పదింతలు వేగమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. 

ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్ సిద్ధమైంది. దీన్నే ఎక్స్‌ఈగా గుర్తించింది. కరోనా సంక్రమణపై అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి ఈ హెచ్చరికలు చేసింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరిక ప్రకారం ఒమిక్రాన్  BA2 సబ్ వేరియంట్ కంటే XEగా పిలుస్తున్నారు. కరోనా వైరస్ కంటే పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరిస్తుందని తేలింది. ఇప్పటి వరకూ బీఏ2 సబ్ వేరియంట్ కంటే ఎక్స్‌ఈగా పిలుస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత తీవ్రమైన అంటువ్యాధిగా గుర్తించారు. ప్రస్తుతం అమెరికాలో ఈ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్స్‌ఈ రకం వేరియంట్‌లో తీవ్రత, వ్యాప్తి ఇతర లక్షణాల్ని గుర్తించే పని జరుగుతోందిప్పుడు. ఇప్పటివరకూ బయటపడిన వైరస్‌లు పరివర్తన చెంది..మరికొన్ని రకాలుగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు ఎప్పట్నించో హెచ్చరిస్తున్న పరిస్థితి. 

Also read: Covid Symptoms in Teeth: కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు.. ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News