Wood Apple Nutrition: వుడ్ యాపిల్ దీనిని తెలుగులో వెలగపండు అని పిలుస్తారు. ఈ పండును ఎక్కువగా వినాయక చవితి రోజును నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఇది దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియాకు చెందిన ఒక సిట్రస్ పండు. ఈ పండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. 5 నుంచి 12 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ పండు పైభాగం గట్టిగా ఉంటుంది . లోపల పసుపు లేదా ఆరెంజ్ రంగులో పుల్లని గుజ్జు కలిగి ఉంటుంది. ఈ వుడ్ యాపిల్ పండును వివిధ రకాలుగా తినవచ్చు. దీనిని పచ్చిగా తినవచ్చు, ఈ వెలగపండుతో కొంతమంది పచ్చడిగా తయారు చేసి తింటారు. లేదా జ్యూస్ చేసుకొని తినవచ్చు. కొంతమంది జామ్, జెల్లీగా ఉపయోగిస్తారు. ఈ వుడ్ యాపిల్ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో ప్రసిద్ధి చెందింది.
వుడ్ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో లాభాలు:
వుడ్ యాపిల్ పండు లో అనేక రకాల పోషకాలు లాభిస్తాయి. ఇందులో విటమిన్ సి, బి 6, పొటాషియం, ఫైబర్ గుణాలు ఉంటాయి. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
* ఆరోగ్యానికి
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: వుడ్ యాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వుడ్ యాపిల్ జ్యూస్ లో పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: వుడ్ యాపిల్ జ్యూస్ లో ఫైబర్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది: వుడ్ యాపిల్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: వుడ్ యాపిల్ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా భావించేలా చేస్తుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది.
చర్మానికి మంచిది: వుడ్ యాపిల్ జ్యూస్ లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలను నివారించడంలో సహాయపడతాయి.
గమనిక:
* ఎక్కువ మొత్తంలో యాపిల్ జ్యూస్ తాగడం వల్ల దంతాల క్షయం, బరువు పెరగడం వంటి దుష్ప్రభావాలు రావచ్చు.
* మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులు ఉంటే, వుడ్ యాపిల్ జ్యూస్ తాగడం మంచిదా కాదా అనే దాని గురించి మీ వైద్యుడి సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి