World Hypertension Day: భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ..రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు..!!

World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 01:05 PM IST
  • ఎండల కారణంగా పెరుగుతు బీపీ
  • భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ
  • రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు
World Hypertension Day: భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ..రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు..!!

World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు ప్రపంచ రక్తపోటు దినోత్సవం(World Hypertension Day) సందర్భంగా బీపీ రోగులు వేసవిలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం..తీవ్రమైన వేడి వాతావరణంలో శరీరానికి వేడి తగలడం వల్ల రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రత తేమ పెరుగుదల కారణంగా రక్తంలో ప్రవాహా స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా లో-బీపీకి గురవుతున్నారు. అంతే కాకుండా సాధారణ రోజు కంటే వేడి కలిగిన ఉన్న రోజు గుండె నిమిషానికి రెండు రెట్లు ఎక్కువ కొట్టుకుంటుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే రక్తపోటు నివారణకు వ్యాయామం చేస్తే మంచిదని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ తెలుపుతున్నారు.

వేసవిలో రక్త నాళాలలో విస్తరణ జరుగుతుంది. దీని కారణంగా శరీరంలో  సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. అయితే శరీరంలో సోడియం కోల్పోవడం వల్ల తక్కువ రక్తపోటుకు దారితీస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో గుండె పోటు, ముత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్న వారు  వేసవిలో ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని ద్రవం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. దీంతో  గుండెపై ఒత్తిడి పెరిగి తీవ్ర ప్రమాదాని దారి తీస్తుందని ప్రముఖ నిపుణులు  కార్డియాక్ సర్జన్, ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమాకాంత పాండా అంటున్నారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో హార్మోన్ స్థాయి పెరుగుతుందని..ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని డాక్టర్‌ పాండా తెలుపుతున్నారు. ఇది రక్తపోటు రోగులలో BP స్థాయిని పరోక్షంగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. బీపీ పెరుగుదల నిద్రపై కూడా ఆధారపడి ఉంటుందని, ముఖ్యంగా వేసవి నెలల్లో కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలని రోగులకు సూచిస్తున్నారు. ప్రస్తుతం 50 ఏళ్లు పైబడిన వారిలో తక్కువ రక్తపోటు సమస్యలు హాని కలిగిస్తున్నాయి. కావున లో- బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా బీపీని పర్యవేక్షించడం మంచిదని సీనియర్ కన్సల్టెంట్- కార్డియాలజీస్ట్‌ డాక్టర్ ఆనంద్ కుమార్ పాండే తెలుపుతున్నారు. 

ఇండియా కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ ఉందని.. కేవలం 10 శాతం మంది రోగులకు మాత్రమే వారి రక్తపోటు నియంత్రణలో ఉందని వెల్లడించింది. లో-బీపీ, హైబీపీ ఉన్న వారు పోషకాలున్న మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంది. బీపీ పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

Also Read: Symptoms Of Dehydration: డీహైడ్రేషన్ లక్షణాలు తెలుసుకోండి... మిమ్మల్ని మీరు కాపాడుకోండి!

Also Read:  KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్‌ చాప్టర్‌ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News