Ammavari Idiol Damaged: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. మోండా మార్కెట్ లో హైటెన్షన్..

Ammavari Idiol Damaged: సికింద్రాబాద్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాస్ పోర్ట్ ఆఫీసు సమీపంలోని కుర్మగూడలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. స్థానికంగా అక్కడ కొలువై ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 14, 2024, 08:50 AM IST
 Ammavari Idiol Damaged: అమ్మవారి విగ్రహం ధ్వంసం.. మోండా మార్కెట్ లో హైటెన్షన్..

Ammavari Idiol Damaged: సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీసుల సమీపంలోని మోండా మార్కెట్ పరిధిలోని ముత్యాలమ్మ గుడిలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  ఇది గమనించిన స్థానికులు దుండగుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ది చేశారు. ఆ తర్వాత పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ముందస్తుగా అలర్ట్ అయిన పోలీసులు కాలనీలో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

రీసెంట్ గా నాంపల్లి ఎగ్జిబిసన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.  వరుసగా హైదరాబాద్ లో  విగ్రహాల ధ్వంసం ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇందులో ఇతర మతస్తులకు చెందిన వ్యక్తులే ఓర్వలేని తనంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు స్థానిక హిందువులు  చెబుతున్నారు. అక్కడ దసరాకు రెండు రోజులు ముందు  అమ్మవారి ఆలయంలో దాండియా ఆడిన తర్వాత యువతీ, యువకులు వెళ్లిపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా మార్నింగ్ వచ్చే వరకు అక్కడ పూజా సామానులతో పాటు అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసి ఉంది.  

హైదరాబాద్ లో ఓ పథకం ప్రకారమే ఈ అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటనలకు ప్లాన్ చేసారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అదుపులోని తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే రీతిలో విచారణ మొదలు పెడుతున్నారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

కొంత మంది అసాంగిక శక్తులు  కావాలనే శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ఈ దుర్మార్గపు పనులు చేస్తున్నారన్నారు.
ముఖ్యంగా  హిందువుల పండగలను టార్గెట్ గా చేసుకుని ముష్కరులు  దాడులకు పాల్పడుతున్నారని హిందు సంఘాలు తమ ధర్మానుగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  ముఖ్యంగా నవర్రాతుల వంటి పర్వదినాల్లో ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News