Major Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు నేలకొరిగారు. అటవీ ప్రాంతంలో జరిగిన భీకర కాల్పుల్లో మావోయిస్టులు తుపాకీ తూటాలకు బలయ్యారు. ఈ సంఘటన చత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత కూడా మరణించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల నుంచి ఆయుధాలు, ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Rape On Buffalo: ఎవడ్రా వీడు పశువుపై పైశాచికం.. గేదెపై అత్యాచారం
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలోని వందోలి గ్రామంలో మావోయిస్టులు సమావేశమవుతున్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. బుధవారం నుంచి అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం భద్రతా దళాలు జల్లెడ పట్టాయి. కూంబింగ్ చేస్తున్న క్రమంలో వందోలి గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సమయంలో పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు 12 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో భద్రతా దళాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల్లో ఓ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా మావోయిస్టుల మృతదేహాలు హెలికాప్టర్ ద్వారా మృతుల స్వస్థలాలకు తరలించారు.
Also Read: Tragic Incident: వరదలతో తెగిన అన్నాచెల్లెలి అనుబంధం.. మృతదేహాన్ని 5 కి మీ మోసుకెళ్లిన అన్నలు
ఘటన స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన ఏకే 47 తుపాకులు, నాటు తుపాకీలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు కూడా చనిపోయి ఉంటారని సమాచారం. తిపగడ్ దళం ఇన్చార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నారని తెలుస్తోంది. ఈ కాల్పుల్లో సీ 60 కమాండోలు పాల్గొన్నాయి. కాల్పుల్లో గాయపడిన సబ్ ఇన్స్పెక్టర్ పేరు సతీశ్ పాటిల్ అని తెలిసింది. కూంబింగ్‌లో స్థానిక పోలీసులు కూడా సహకరించారు.
ఉదయం నుంచి జల్లెడ
మావోయిస్టుల సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఉదయం 10 గంటల నుంచే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. మావోయిస్టులు ఎదురైన సమయంలో కాల్పులు మొదలయ్యాయి. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 6 గంటలపాటు ఈ కాల్పులు జరిగాయి. నక్సల్స్ నుంచి 7 ఆటోమెటిక్ ఆయుధాలు, 3 ఏకే 47 తుపాకులు, 2 ఇన్సాస్, ఒక కార్బన్, ఎస్ఎల్ఆర్ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల జరిగిన చత్తీస్గడ్ ఎన్నికల అనంతరం ఇదే భారీ ఎన్కౌంటర్ కావడం గమనార్హం. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి మావోయిస్టులపై యుద్ధం ప్రకటించినట్టు చర్చ జరుగుతోంది.
महाराष्ट्र के गढ़चिरौली में सी-60 कमांडो और नक्सलियों के बीच बड़ी मुठभेड़। १२ नक्सलियों को अब तक ऑपरेशन में मार गिराया गया। ऑपरेशन अब भी जारी। #Maharashtra @News18India @SP_GADCHIROLI @Dev_Fadnavis @DGPMaharashtra pic.twitter.com/PaUNkiAhNE
— Diwakar Singh (@Diwakar_singh31) July 17, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter