PM Modi on Election Results: ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కూడా తేల్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలతో హోలీ పండగ ముందుగానే వచ్చినట్లయిందని అన్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఈసారి బీజేపీకి విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతీ ఓటరును అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ మాట్లాడారు.
బీజేపీ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించారని.. చెప్పినట్లుగానే బీజేపీని విజయ తీరాలకు చేర్చారని మోదీ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను ముందుండి నడిపించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను ఈ సందర్బంగా అభినందించారు. 38 ఏళ్ల చరిత్రలో యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని అన్నారు. గోవా ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయని... పదేళ్ల పాలన తర్వాత కూడా అక్కడ తమ సీట్ల సంఖ్య పెరిగిందని అన్నారు.
'బీజేపీకి ఓటు వేసిన ప్రతీ ఓటరుకు ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యంగా మహిళా ఓటర్లకు. వారి మద్దతు వల్లే ఇవాళ బీజేపీ ఇంత గొప్ప ఫలితాలు సాధించింది. దేశంలోని మహిళలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. తల్లులు, సోదరిమణులు, ఆడబిడ్డలంతా బీజేపీ గెలుపుకు దోహదపడ్డారు. దేశ మహిళల ఆదరాభిమానాలు చూరగొనడం బీజేపీ అదృష్టంగా భావిస్తున్నాను.' అని మోదీ పేర్కొన్నారు.
ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ కులాల వారీగా విడిపోయి ఉండేదని.. కానీ ఇప్పుడు యూపీ ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయని గతంలో కొంతమంది నిపుణులు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా 2022 ఫలితాలు 2024 ఫలితాలను నిర్దేశిస్తాయని.. ఇదే మాట నిపుణులు చెబుతారని విశ్వసిస్తున్నానని చెప్పుకొచ్చారు.
Also Read: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సందడి షురూ.. సినిమాలోని విశేషాలు తెలుసా?
Also Read: Election Results 2022: ముగిసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook