ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడి 25 మంది దుర్మరణంపాలైన దుర్ఘటన కర్ణాటకలోని మాండ్య సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బస్సు విశ్వేశ్వరయ్య కాలువలో పడిన ఘటనలో 25 మంది చనిపోయారని మీడియాకు వెల్లడించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర.. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించలేదని భావిస్తున్నట్టు తెలిపారు. తొలుత ఈ ఘటనలో 15 మంది చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర.. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది చనిపోయారని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా భావిస్తున్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. కాలువ లోతుగా ఉండటంతోపాటు కాలువ నిండా నీళ్లు ఉండటమే ఈ ప్రమాదం తీవ్రత పెరగడానికి మరో కారణమైందని తెలుస్తోంది.
Karnataka: At least 15 people died after the bus they were in, fell into VC canal near Mandya earlier today. The death toll is likely to rise. pic.twitter.com/1fFs4z7tOI
— ANI (@ANI) November 24, 2018
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయసిబ్బంది సహాయ చర్యలు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.