Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం...60 గుడిసెలు దగ్ధం.. ఏడుగురు దుర్మరణం

Delhi Fire Accident: ఢిల్లీ గోకుల్​పురి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా... 60 గుడిసెలు దగ్ధమయ్యాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 02:54 PM IST
Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం...60 గుడిసెలు దగ్ధం.. ఏడుగురు దుర్మరణం

Delhi Fire Accident: ఢిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలోని (Gokulpuri) మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు బాలికలు ఉన్నట్లు సమాచారం. మంటల్లో దాదాపు 60 గుడిసెలు దగ్ధమయ్యాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. 13 అగ్నిమాపక శకటాలు కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశాయి. నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో వారు తప్పించుకోలేకపోయారని... అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) పరామర్శించారు.

 ''అగ్ని ప్రమాదంలో 7 మంది మృతి చెందడం బాధాకరం. మరణించిన పెద్దల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గుడిసెలు కాలిపోయిన వారికి రూ.25,000 ప్రభుత్వం అందజేస్తుంది''-  సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ 

అంతకముందు ఏడుగురి మృతి పట్ల ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ (MP Manoj Tiwari) సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపి, కుటుంబ సభ్యులకు తక్షణమే కోటి రూపాయల సాయం ప్రకటించాలని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మనోజ్ తివారీ పరిశీలించారు. అంతేకాక బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Also Read: AAP national party status: జాతీయ పార్టీ హోదాతో.. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆప్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News